Brahmaji: బెంగాలీ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ నటుడు..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఊహించని విధంగా గుర్తింపు పొందినటువంటి నటులలో నటుడు బ్రహ్మాజీ కూడా ఒకరు.. మొదట ఈయన పలు సినిమాలలో విలన్ గా, సైడ్ క్యారెక్టర్ గా నటించినప్పటికీ గుర్తింపు సంపాదించుకోలేకపోయారు.. కానీ కమెడియన్ గా మారి పలు సినిమాలలో నటించడం వల్ల భారీ క్రేజ్ ను అందుకున్నారు. తనదైన కామెడీ పంచ్ డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. ఇటీవల బ్రహ్మాజీ గురించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది వాటి గురించి చూద్దాం.

తాజాగా నటుడు బ్రహ్మాజీ బెంగాలీ సినిమాలలో అవకాశం సొంతం చేసుకున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసిన పలువురు అభిమానులు తెలుగు ఇండస్ట్రీ కీర్తి ప్రతిష్టలు పెంచారంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటించగలిగిన నటుడు బ్రహ్మాజీ …తనకు ఇచ్చిన పాత్రకు పూర్తిగా న్యాయం చేయగలరు..ముఖ్యంగా ఈ సినిమాలో కూడా కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.

ఇప్పటికే కన్నడ , హిందీ, తమిళ్ వంటి భాషలలో నటించిన బ్రహ్మాజీ ఇప్పుడు బెంగాలీ సినిమాలలో కూడా కీలకమైన పాత్రలో అవకాశాన్ని దక్కించుకోవడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం భువనేశ్వర్ లో ఈ సినిమా షూటింగు జరగబోతున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మాజీ తన కెరియర్ లో ఎప్పుడూ కూడా వివాదాలకు తావు ఇవ్వరు.. ఈయన వయసు 58 సంవత్సరాలు అయినప్పటికీ కెరియర్ పరంగా ఎలాంటి మచ్చ లేకుండా ముందుకు వెళుతున్నారు.. ముఖ్యంగా రవితేజ , బ్రహ్మాజీ ఇద్దరు కూడా ఒకేసారి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా..రవితేజ హీరోగా ఎదగగా.. బ్రహ్మాజీ కమీడియన్ గా స్థిరపడిపోయారు.

- Advertisement -

మరి బెంగాలీ భాషలో కూడా నటిస్తున్న బ్రహ్మాజీ అక్కడ మరిన్ని సినిమాలలో నటించి బిజీ యాక్టర్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.MN రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉండగా రక్తిమ్ చటర్జీ ప్రొడ్యూసర్ గా ఉంటున్నారు.. సలార్ సినిమా చూసే ఈయనకు ఈ పాత్ర వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో విభిన్నమైన పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు బ్రహ్మాజీ. ప్రస్తుతం బ్రహ్మాజీ కి సంబంధించి ఈ న్యూస్ మాత్రం వైరల్ గా మారుతోంది. మొత్తానికి అయితే ప్రభాస్ నటించిన సలార్ సినిమా వల్లే బ్రహ్మాజీకి బెంగాలీ భాషలో అవకాశం లభించింది అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా బ్రహ్మాజీ నటన అన్ని భాషల వారిని మెప్పిస్తోంది అనడంలో సందేహం లేదు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు