SV. Krishnareddy: రాజేంద్రప్రసాద్ తో గొడవ అందుకే – కృష్ణారెడ్డి..!

టాలీవుడ్ లో సీనియర్ హీరోగా, కమెడియన్ గా, నటుడుగా ఎంతో ప్రాధాన్యత సంపాదించుకున్నారు హీరో రాజేంద్రప్రసాద్.. గతంలో ఈయన ఎన్నో కామెడీ చిత్రాలలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ , S.V.కృష్ణారెడ్డి కాంబినేషన్ అంటే ఆ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అనే కాంబో అని చెప్పవచ్చు. వీరి కాంబినేషన్లో వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, కొబ్బరి బొండం ఇలా వరుస విజయాలను అందుకున్నారు. అయితే ఆ తర్వాత వీరిద్దరూ కలిసి మరే సినిమాలో కూడా పనిచేయలేదట.

అసలు విషయంలోకి వెళ్తే.. మూడు సినిమాలు అయిపోయిన తర్వాత రాజేంద్రప్రసాద్ , కృష్ణారెడ్డి మధ్య ఈగో క్లాష్ వచ్చాయని గతంలో వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయం పైన ఇప్పటివరకు అటు కృష్ణారెడ్డి కానీ నటుడు రాజేంద్రప్రసాద్ కానీ పెద్దగా స్పందించలేదు. ఎట్టకేలకు ఆ రోజుల్లో ఏం జరిగిందనే విషయాన్ని డైరెక్టర్ కృష్ణారెడ్డి ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.. మాయలోడు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో.. ఈ చిత్రంలో చినుకు చినుకు పాటకు సౌందర్య కాల్ సీట్లు సంపాదించామని తెలిపారు.

అప్పట్లో సౌందర్య ఫుల్ బిజీగా ఉండేదని.. తన డేట్లు దొరకడమే చాలా కష్టము కానీ కష్టపడి డేట్లు ఎలాగోలా సర్దుబాటు చేసాము. వెంటనే రాజేంద్రప్రసాద్ కి ఫోన్ చేసి సౌందర్య డేట్లు దొరికాయి మనం షూటింగ్ పెట్టుకుందామని చెప్పగా.. సౌందర్య ఇచ్చిన డేట్ లకు తన డేట్లు అడ్జస్ట్ చేయాల అంటూ ఈగోకి పోయారట రాజేంద్రప్రసాద్.. అయితే ఈ విషయాన్ని కంటే ముందే రాజేంద్రప్రసాద్ కృష్ణారెడ్డి మధ్య కాస్త కోల్డ్ వార్ నడిచిందట.. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని మాయలోడు షూటింగ్ విషయంలో రాజేంద్రప్రసాద్ చాలా ఇబ్బంది పెట్టారని తెలిపారు.

- Advertisement -

అంతేకాకుండా రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ కూడా చెప్పలేదట.. ఒక పాట కూడా ఇంకా పూర్తి చేయాలని చెప్పినా రాజేంద్ర ప్రసాద్ షూటింగ్ కి కూడా రాలేదట.. అలా మొండికేయడంతో డైరెక్టర్ కృష్ణారెడ్డి ఆలోచన బాబు మోహన్ రూపంలో మెదిలింది.. రాజేంద్ర ప్రసాద్ పాటను బాబు మోహన్ తోనే చేయిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాక వెంటనే బాబు మోహన్ కి ఫోన్ చేసి అన్నపూర్ణ స్టూడియోలో మూడు రోజులు సమయాన్ని కేటాయించాలి అంటూ తెలిపారట. సడన్గా చినుకు చినుకు పాటని బాబు మోహన్ తో చేయించారనే వార్త రాజేంద్ర ప్రసాద్ కి వినిపించగా.. ఈ పాటను ఎవరు చూస్తారు.. తానే స్వయంగా ఈ పాటలో నటిస్తానని మేనేజర్ తో… కృష్ణారెడ్డికి చెప్పమంటూ తెలిపారట రాజేంద్రప్రసాద్.

కానీ అప్పటికే కృష్ణారెడ్డి బాబు మోహన్ కి మాట ఇచ్చారని.. ఈ పాట చేస్తే బాబు మోహన్ తో చేస్తానని లేకపోతే లేదని పట్టుబట్టడంతో రాజేంద్రప్రసాద్ చేతిలో నుంచి ఈ పాట చేజారిపోయింది.. కానీ అప్పట్లో సౌందర్య, బాబు మోహన్ తో డాన్స్ వేయడంతో ఆశ్చర్యంతో జనాలు థియేటర్లకు వచ్చారని బాబు మోహన్ స్టెప్పుల చూడడానికి.. ముఖ్యంగా ఈ పాట కోసమే మళ్లీ మళ్లీ ఎంతోమంది ప్రేక్షకులు సినిమా థియేటర్ కి వచ్చి చూశారని చివరికి బాబు మోహన్ పాట ఒక స్పెషల్ సాంగ్ గా మారిందని తెలిపారు కృష్ణారెడ్డి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు