HBD Sekhar Kammula: శేఖర్ కమ్ముల గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నప్పటికీ శేఖర్ కమ్ముల వంటి డైరెక్టర్ మాత్రం కొందరిలో ఒకరిని చెప్పవచ్చు. ఈయన సినిమాలలో ఎక్కువగా తెలుగుదనం ఉట్టిపడేలా ఉండడమే కాకుండా విలువలకు ప్రాధాన్యత ఇస్తూ.. అశ్లీలను చూపించకుండా ఉంటారు. అందుకే యూత్ ప్రేక్షకులు సైతం ఈయన సినిమాలకు ఫిదా అవుతూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ ని తెలుగు అమ్మాయిగా.. తెలుగుదనం ఉట్టిపడేలా చూపించడంలో దిట్ట శేఖర్ కమ్ముల అని చెప్పడంలో సందేహం లేదు. ఈ రోజున ఈయన 52వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. మరి శేఖర్ కమ్ముల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించే సినిమాలలో ఎక్కువగా స్టార్స్ కనిపించరు.. కేవలం కథ మాత్రమే సినిమాకు స్టార్డం తెచ్చి పెట్టేలా తన మేకింగ్ ని చూపిస్తూ ఉంటారు.. 1972 ఫిబ్రవరి 4న శేఖర్ కమ్ముల ఆంధ్ర ప్రదేశ్ లోని ఏలూరు ప్రాంతంలో జన్మించారు.. ఈయన బాల్యం నుండి హైదరాబాద్ లోనే ఎక్కువగా గడిపారు. ఆ తర్వాత USA లో సినిమాలకు సంబంధించి టెక్నికల్ కోర్సులు చేసి ఇండియాకు తిరిగివచ్చి.. మొదటిసారిగా డాలర్ డ్రీమ్ అనే ఫస్ట్ సినిమాతోనే ఎన్నో అవార్డులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు.

ఆ తర్వాత కొత్త వాళ్లతో తక్కువ బడ్జెట్ తో ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా తీసి మంచి విజయాన్ని అందుకున్నారు.. ఈ సినిమా రిలీజ్ సమయంలో చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా పోటీ గా వచ్చినప్పటికీ ఆ సినిమాకి పోటీ ఇచ్చి మరీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం గా నంది అవార్డుతో పాటు శేఖర్ కమ్ములకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా లభించింది.

- Advertisement -

ఆ తర్వాత గోదావరి సినిమాతో బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనుకున్నారు. ఈ సినిమాకి కూడా బెస్ట్ డైరెక్టర్ గా నంది అవార్డు లభించింది.ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాలో పూర్తిగా కొత్త నటులను పరిచయం చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా ద్వారా వచ్చిన నటీనటులు తెలుగు ఇండస్ట్రీలో స్టార్స్ గా ఎదిగారు కూడా. హ్యాపీడేస్ సినిమా ఏకంగా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకుంది.

శేఖర్ కమ్ముల జీవితం మిడిల్ క్లాస్ జీవితం. ఆయన కథలు కూడా వాస్తవికతకు కాస్త దగ్గరగానే ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో బాపు తర్వాత అంత అందంగా హీరోయిన్ ను చిత్రీకరించే వ్యక్తి ఒక్క డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాత్రమే అని చెప్పవచ్చు.. హ్యాపీ డేస్ సినిమా తర్వాత లీడర్ సినిమాని తెరకెక్కించి దగ్గుబాటి రానాని హీరోగా పరిచయం చేశారు. ఈ సినిమాకి శేఖర్ కమ్ములకు బెస్ట్ స్టోరీ రైటర్ గా నంది అవార్డు కూడా లభించింది. చివరిగా నాగచైతన్య, సాయి పల్లవి తో కలిసి లవ్ స్టోరీ అనే సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మళ్లీ తాజాగా లీడర్-2 సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ధనుష్ తో కూడా పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు