Rekha: @8 లోనే ఆమెపై కన్ను.. కానీ ఇప్పటికీ సింగిలే..!

బాలీవుడ్ బ్యూటీ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు ప్రముఖ స్టార్ హీరోయిన్ రేఖ.. తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు ఇప్పటికీ ఎంతోమంది యువతను తన వశం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.. అందుకే ఇండియా లెజెండ్రీ యాక్ట్రెస్ గా , ఎవర్గ్రీన్ బ్యూటీగా పేరు దక్కించుకుంది. నటన డాన్స్ తో పాటు కళ , అందంలో ఆమెకు ఆమె సాటి.. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఆమె గ్లామర్ చూసి ఫిదా కాని వారు ఉండరు. 70స్ లో రేఖకు ఫుల్ డిమాండ్ ఉండేది.. ఆమెను చూసిన వాళ్లంతా కచ్చితంగా తమ సినిమాలలో ఈమెకు అవకాశాలు ఇవ్వాలని తాపత్రయపడేవారు. అలా స్టార్ హీరోయిన్గా బిజీగా ఉన్న సమయంలోనే ఒక ఎనిమిదేళ్ల కుర్రాడు ఈమెతో ప్రేమలో పడ్డాడట ..

రేఖ అందాన్ని చూసి మైమరిచిపోయి పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని పట్టుబట్టాడట. ఇంకా గమ్మత్తైన విషయం ఏమిటంటే.. ఆ చిన్న పిల్లాడు ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నాడు.. రేఖను చూసిన వెంటనే నేను పెద్దయ్యాక నిన్నే పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాడట.. అయితే ఇప్పుడు ఆ చిన్న పిల్లాడు 58 ఏళ్లు వచ్చినా ఇంకా ఒంటరిగానే ఉన్నాడు. మరి ఆయన ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా.. అవును.. ఆయనే కండల వీరుడు సల్మాన్ ఖాన్.. సల్మాన్ ఖాన్ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే రేఖ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది.

ఆమె నడుచుకుంటూ వెళ్తే రేఖ వెనకాలే వచ్చిన సల్మాన్ ఖాన్ ఇంటికి వెళ్లి.. పెద్దయ్యాక నిన్నే పెళ్లి చేసుకుంటానని రేఖతో చెప్పాడట.. ఇందులో విశేషం ఏమిటంటే అప్పట్లో సల్మాన్ ఖాన్ వయసు 8 ఏళ్ళే.. ఆ మాట చెప్పినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన వివాహం చేసుకోలేదు.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ వయసు 58 సంవత్సరాలు.. ఇంకా వివాహం చేసుకోకుండా బ్యాచిలర్ గానే మిగిలిపోయాడు. ప్రేమ జీవితం సక్సెస్ కాకపోవడంతో రేఖ కూడా ఒంటరిగా జీవిస్తోంది. అమితాబ్ బచ్చన్ కి భార్య అయ్యే అదృష్టాన్ని కోల్పోయింది. మరో పెళ్లి చేసుకుందామని అనుకున్నా కూడా ఆ పెళ్లి కుదరలేదు.. అనుకోకుండా జరిగిందో లేక ఏమో తెలియదు కానీ అటు ఇష్టపడిన నటుడితో కూడా వివాహం జరగకపోవడంతో ఇప్పటికీ ఒంటరిగానే జీవిస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ.. అటు సల్మాన్ ఖాన్ కూడా తనను ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవిస్తున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు