Lifestyle: ఎర్లీ ట్వంటీస్ లో ఉన్నారా? ఈ టిప్స్ తో లైఫ్ సెట్టు

మనిషి జీవిత ప్రయాణంలో ట్వంటీస్ అనేది కీలకమైన దశాబ్దం. 20లోకి అడుగు పెడుతున్నారంటే అప్పుడే టీనేజ్ దాటి అడల్ట్ గా మారుతున్న సమయం. లైఫ్ లో ఎలాంటి దారిలో వెళ్లాలి అని నిర్ణయించుకునే టైం. స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా పెరుగుతుంది. 20లలో కలిగే ఎక్స్పీరియన్స్, లెసన్స్, రిలేషన్ షిప్స్ వంటి అంశాల ఎఫెక్ట్ లైఫ్ పై స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలోనే హెల్దీ కనెక్షన్స్ క్రియేట్ చేసుకోవడం, ఫైనాన్షియల్ స్టేబిలిటీ సాధించడం వంటివి నేర్చుకోవాలి. ఇవన్నీ సాధించాలంటే ముందుగా కొన్ని విషయాలను అర్థం చేసుకోవాలి.

1. మీ ఇంట్రెస్ట్ ఏంటో అర్థం చేసుకోండి
మీ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోవడానికి వివిధ రకాల హాబీస్ ను అలవాటు చేసుకోండి. క్రియేటివ్ ప్రాజెక్ట్స్, వాలంటీర్ వర్క్ లేదా ట్రావెల్ అడ్వెంచర్లలో పాల్గొనండి. ఇలా మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్లడం వల్ల కాన్ఫిడెన్స్ పెరగడంతో పాటు మీ టాలెంట్ బయట పడుతుంది.

2. క్యూరియాసిటీ ముఖ్యం
టీనేజ్ నుంచి 20లలోకి అడుగు పెట్టే వాళ్లకు కొన్ని విషయాల్లో నమ్మకాలు, ప్రయారిటీస్, పర్స్పెక్టివ్స్ మారవచ్చు. కాబట్టి ప్రతి విషయంలోనూ క్యూరియాసిటినీ కనబరిచే మనస్తత్వం ఉంటే కొత్త విషయాలను తెలుసుకోవడం ద్వారా మరింత మెచ్యూర్ గా వ్యవహరించగలుగుతారు. పర్సనల్ ఎవల్యూషన్ కోసం స్పేస్ ఇవ్వడం మర్చిపోకండి.

- Advertisement -

3. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ద్వారా కాన్ఫిడెన్స్ పెంచుకోండి. శ్రద్ధగా మీ మనసు ఏం చెబుతుందో విని దాన్ని ఫాలో అవ్వండి.

4. మీ చదువుకు తగ్గ ఉద్యోగాన్ని ఎంచుకోవడానికి ముందు దానిపై ఎలాంటి అవకాశాలు ఉంటాయి, వాటి వల్ల ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ముందే తెలుసుకోండి. మంచి జీతాలు, సెక్యూరిటీ, డెవలప్మెంట్, అవకాశాలు వంటివి బాగుండే జాబ్స్ ను సెలెక్ట్ చేసుకోండి.

5. కొంతమంది డ్రీమ్ జాబ్ సంపాదించడానికి టైం పడుతుంది అనిపించినప్పుడు బ్రతకడానికి కొన్ని చిన్న చిన్న జాబ్స్ చేయాల్సి వస్తుంది. అలాంటి వాటిని తక్కువ చేసి చూడొద్దు. మీరు రెజ్యూమ్ లో ఇప్పటిదాకా చేసిన ప్రతి జాబ్ ను స్కిల్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ గా చేర్చుకోవచ్చు. కాబట్టి మీరు రెజ్యూమ్ రూపొందించుకోవడానికి ఇప్పటిదాకా చేసిన ప్రతి ఉద్యోగాన్ని ఒక మెట్టుగా ఉపయోగించుకోండి.

6. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే ఫిజికల్ అట్రాక్షన్. 20లలో డేటింగ్ లాంటివి చేస్తే లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమవుతుంది. పైగా ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఫలితంగా నచ్చిన వాళ్ళతో లైఫ్ కలిసి ఉండలేనంత దారుణంగా ఉంటుంది. కాబట్టి లైఫ్ లో సెటిల్ అయ్యేదాకా డేటింగ్ ను కాస్త పక్కన పెట్టండి.

7. ఇక ఇప్పటినుంచి మంత్లీ ఖర్చులను లెక్కలేసుకొని, సేవింగ్స్ పై దృష్టి పెట్టండి. 20లలో కష్టపడి పని చేయడం వల్ల లైఫ్ లో త్వరగా సెటిల్ అవుతారు. అయితే పూర్తిగా సెటిల్ అయ్యేదాకా స్ట్రెస్ ఫీల్ అవ్వమని కాదు. అప్పుడప్పుడు ప్రయాణాలు చేయడం, ఎంటర్టైన్మెంట్ ను ఆస్వాదించడం, ఇష్టమైన వాళ్లతో కలిసి టైం స్పెండ్ చేయడం వంటి వాటిని మర్చిపోవద్దు. ఈ చిన్న చిన్న టిప్స్ అన్నీ పాటిస్తే లైఫ్ లో త్వరగా సెటిల్ అయిపోతారు. అప్పుడు మిగిలిన జీవితం అంతా హ్యాపీగా గడుస్తుంది. లేదంటే చాలామందిలాగే జీవితాంతం కష్టాల కొలిమిలో పడి కొట్టుకోవాల్సి వస్తుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు