Guntur Karam OTT: రిలీజ్ అయి నెల కాకముందే

Guntur Karam OTT

త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాలు థియేటర్ వద్ద కమర్షియల్ గా హిట్ కాలేదు. కానీ టీవీలో వచ్చిన ప్రతిసారి హైయెస్ట్ టీఆర్పి రేటింగ్‌ను నమోదు చేసుకుంటాయి. అయితే ఆ సినిమాలు కమర్షియల్ గా హిట్స్ సాధించలేదు కాబట్టి వీరిద్దరూ కలిసి ఒక కమర్షియల్ హిట్ సినిమాని బాక్సాఫీస్ వద్ద సాధిద్దామని మూడోసారి కాంబినేషన్ సెట్ చేసుకున్నారు.

వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమా గుంటూరు కారం. ఈ కాంబినేషన్, ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. కానీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోలేదు అనేది ఎక్కువ శాతం మంది అభిప్రాయం. సినిమా మొదటి షో పడినప్పుడు నుంచే మిశ్రమ స్పందనను అందుకుంది. అయితే దీనికి అసలైన కారణం ఇది ఒక కమర్షియల్ సినిమా అంటూ పబ్లిసిటీ చేయటమే. తీరా థియేటర్ కి వచ్చేసరికి ఇదొక ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చాలామందికి ఒక క్లారిటీ వచ్చింది.

ఇది ఫ్యామిలీ సినిమా క్లారిటీ వచ్చేలోపే ఈ సినిమాకి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది. ఇకపోతే ఏదేమైనా మహేష్ బాబుకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వలన, క్రేజ్ వలన ఈ సినిమా కొంతమేరకు బాగానే వసూలు చేసింది. అయితే ఈ సినిమా ఓటిటి రిలీజ్ గురించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసింది మూవీ టీం. ఒక సినిమా రిలీజ్ అయిన నెల రోజులకే ఓటీటీ లో ప్రత్యక్షమవడం అనేది ఆశ్చర్యకరమైన విషయం.

- Advertisement -

అలాంటిది మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం సినిమా అంత త్వరగా రావటం అనేది సినిమా యొక్క రిజల్ట్ అనే చెప్పొచ్చు. ఈ సినిమా నెట్ ఫిక్స్ లో ఫిబ్రవరి 9న రిలీజ్ కానున్నట్లు అధికార ప్రకటన వచ్చింది. ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుక గా రిలీజ్ అయింది. ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయిన నెల రోజులు కంటే ముందే ఓటీటీ లో రిలీజ్ అవ్వడం, మహేష్ అభిమానులకి కొంచెం జీర్ణించుకోలేని విషయమని చెప్పొచ్చు.

Guntur Karam Movie OTT Release Date Update

ఒకప్పుడు స్టార్ హీరోలు సినిమాలు 50 రోజులు ఆడటం విశేషంగా చెప్పుకునే వాళ్ళు. అటువంటిది ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అయిన నెల రోజుల్లోనే ఓటీటీ లోకి వచ్చేస్తుంది. ఈ రోజుల్లో ఒక సినిమా హిట్ ని ఆ సినిమాకు వచ్చే కలెక్షన్లతో చెప్పుకుంటూ వస్తున్నారు. ఏదేమైనా థియేటర్లో ఆశించిన స్థాయిలో ఆదరణ రాని ఈ సినిమాకి ఓటీటీ లో ఎంత మేరకు లభిస్తుందో వేచి చూడక తప్పదు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు