Inaya Sulthana: అప్పుడు వర్మ.. ఇప్పుడు వేణు స్వామి.. వర్కౌట్ అవుతుందా..?

Inaya Sulthana

బెల్లం ఎక్కడుంటే ఈగలు అక్కడే వాలినట్టు ఎవరి దగ్గర పాపులారిటీ లభిస్తుంది అంటే వారి వైపే ముగ్గు చూపుతున్నారు సెలబ్రిటీలు. ఈ క్రమంలోనే భారీ పాపులారిటీ దక్కించుకున్న రాంగోపాల్ వర్మ దృష్టిలో పడితే చాలు పాపులారిటీ దక్కించుకోవచ్చు అనుకునే చాలా మంది సెలబ్రిటీలు ఇప్పుడు ప్రముఖ ఆస్ట్రాలజర్ గా గుర్తింపు తెచ్చుకున్న వేణు స్వామి వద్దకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటివారిలో బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా కూడా ఒకరు. ఇకపోతే సీజన్ -6 లో హాట్ ఫేవరెట్ గా నిలిచిన ఇనయా సుల్తానా బిగ్ బాస్ షో కి వచ్చే ముందు వరకు సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ దక్కించుకుంది.

ముఖ్యంగా డైరెక్టర్ రాంగోపాల్ వర్మతో డాన్స్ చేసిన వీడియోతో ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అయింది. దీంతో ఎలాగైనా సీజన్ -6 టైటిల్ గెలవాలనే ఆశతో బిగ్ బాస్ హౌస్ లో హాట్ హాట్ డ్రెస్ లతో టీవీ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఒక రకంగా ఓవరాక్షన్ కూడా చేసి ట్రోల్స్ ఎదుర్కొంది. సీజన్ మొత్తంలో టాప్ ఫైవ్ లో నిలిచిన ఈమె ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన చాలామంది ఆర్టిస్టులు స్టేజ్ షో పెర్ఫార్మర్లుగా మారిపోయారు. అయితే ఒకరిద్దరు సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు పొందినా.. పేరు రాకపోవడంతో ఫేడ్ అవుట్ అయ్యారు.

అందుకే ఇనయా సుల్తానా కూడా సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. తాజాగా నటరత్నాలు పేరుతో ఒక సినిమాలో అవకాశం దక్కించుకున్నప్పటికీ ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. అందుకే ఇండస్ట్రీలో తన ఫ్యూచర్ ఎలా ఉంటుందో… నిలబడతానో లేదో అనే సందేహం ఈమెలో పెరిగిపోయినట్లుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో అప్పుడు వర్మతో వచ్చిన గుర్తింపును బిగ్‌బాస్ హౌస్‌లో ఉపయోగించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సినిమాలలో అవకాశాల కోసం వేణు స్వామిని కలిసింది.. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు వేణు స్వామితో పూజలు చేయించి స్టార్ హోదా దక్కించుకున్న విషయం తెలిసిందే. అందుకే అలాంటి హోదా కోసమే ఇనయ ఇప్పుడు వేణు స్వామిని కలిసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

అందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు వేణు స్వామి పుట్టినరోజు నాడు .. మై గురూజీ హ్యాపీయెస్ట్ బర్త్డే అంటూ విషెస్ చెబుతూ గుడి దగ్గర వేణు స్వామి ఆశీర్వాదం తీసుకుంది.. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఇంస్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చెప్పే వేణు స్వామిని ఇనయా సుల్తానా కలవడం వెనుక అసలు రహస్యం ఏమిటో అర్థం కావడం లేదు.. అయితే కొంతమంది మాత్రం అవకాశాల కోసమే ఇప్పుడు వేణు స్వామి వద్దకు చేరింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మరి ఇలాగైనా ఈమెకు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు