Indraja Shankar: ఘనంగా కమెడియన్ కూతురి పెళ్లి.. 20 ఏళ్లకే…

ప్రస్తుతం సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు వివాహం చేసుకొని ఒక ఇంటి వారు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రముఖ తమిళ్ కమెడియన్ రోబో శంకర్ ఇంట కూడా త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. డైరెక్టర్ కార్తీక్ తో ఆయన కూతురు ఇంద్రజాకు నిశ్చితార్థం జరిగింది. ఫిబ్రవరి 2వ తేదీన చెన్నైలో వీరి ఎంగేజ్మెంట్ జరగగా.. తాజాగా ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ నిశ్చితార్థానికి ఇరువురు కుటుంబ సభ్యులతో పాటు అతి దగ్గర బంధుమిత్రులు, సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ శుభకార్యానికి సంబంధించిన ఫోటోలను ఇంద్రజ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసుకున్నారు. పలువురు సెలబ్రిటీలు, నెటిజెన్లు ఈమెకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరో నెల రోజుల్లో వీరి వివాహం జరగబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే వీరి వివాహానికి ప్రముఖ కమెడియన్ రోబో శంకర్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. చెన్నైలో జరగబోయే ఈ వేడుకకి గానూ సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందనున్నట్లు సమాచారం. ఇకపోతే ఇంద్రజ విషయానికి వస్తే.. విజయ్ హీరోగా నటించిన బిగిల్ ఈ సినిమాని తెలుగులో విజిల్ పేరిట విడుదల చేశారు. ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది ఇంద్రజ. తెలుగులో పాగల్ అనే సినిమా కూడా చేసింది. ఇందులో ఈ సింగిల్ చిన్నోడే అనే పాటలో మాత్రమే కనిపిస్తుంది. కార్తీ విరుమాన్ సినిమాలో హీరోయిన్ అదితి శంకర్ స్నేహితురాలిగా కూడా నటించింది. ఇక పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేస్తుందా అంటే అవును అనే చెప్పాలి.

ఈమె కాబోయే భర్త డైరెక్టర్ కావడంతో ఇక సినిమాలలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు ఉంది ఇంద్రజ. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే. ప్రస్తుతం ఈమె వయసు 20 సంవత్సరాలు మాత్రమే.. ఇంత చిన్న వయసులోనే వివాహం చేసుకుంటుండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈమె తండ్రి రోబో శంకర్ విషయానికి వస్తే.. ఇతడు రోబో డాన్స్ తో బాగా ఫేమస్ అయ్యారు.. అందుకే ఆయనకు ఆ పేరు వచ్చింది.. తనకు వచ్చిన మిమిక్రీతో సినిమాలలో అడుగుపెట్టి నెమ్మదిగా ఒక్కో సినిమా చేసుకుంటూ ఇప్పుడు భారీ క్రేజ్ దక్కించుకున్నారు.

- Advertisement -

ఇప్పుడు ఏకంగా 10 సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.. దాదాపు తమిళ స్టార్ హీరోలు అందరితో కూడా కలిసి పనిచేశారు.. ఇప్పుడు ఇంద్రజ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు