VD The Family Star: రష్మిక బర్త్ డే విజయ్ కి కలిసొస్తుందా..?

రష్మిక మందన్న పుట్టినరోజు అయితే.. విజయ్ దేవరకొండ కి ఎలా కలిసి వస్తుందనే డౌట్ అందరికీ వచ్చి ఉండొచ్చు.. ప్రస్తుతం ఇదే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది .. దీనికి కారణం గత కొంతకాలం నుంచి రష్మిక విజయ్ దేవరకొండ మధ్య ఏదో ఉందనే ప్రచారం విస్తృతంగా జరగడమే. ఇద్దరు కలిసి కేవలం నటించింది రెండు సినిమాలలో అయినా.. అంతకుమించి ఇద్దరి మధ్య ఏదో ఉందనేలాగా ప్రవర్తిస్తున్నారు. అంతేకాదు విజయ్ దేవరకొండ కి రష్మిక ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ గా మారిపోయింది. కుటుంబంలో ఒకరిగా కలిసిపోయింది. విజయ్ తనకి మంచి ఫ్రెండ్ అంటూ రష్మిక ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చింది. అయితే విజయ్ కూడా తమ బంధం పై క్లారిటీ ఇచ్చినా.. రూమర్లు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ది ఫ్యామిలీ స్టార్..

ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ అనుకోకుండా ఏప్రిల్ 5వ తేదీన రష్మిక పుట్టినరోజు కూడా కావడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి ఏప్రిల్ 5వ తేదీన ఎన్టీఆర్ దేవరా సినిమా విడుదల కావాల్సి ఉంది..ఇక కొరటాల శివ ఎప్పుడో ఈ డేట్ ఫిక్స్ కూడా చేసుకున్నారు.. కానీ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో సినిమా విడుదల తేదీని వాయిదా వేయబోతున్నారని టాక్ నడిచింది. అంతేకాదు దేవర సినిమా వాయిదా పడితే ఆ డేట్ కి ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ చేస్తారని దిల్ రాజు కూడా ఒక ప్రెస్ మీట్ లో వెల్లడించారు. ఇక అన్నట్లుగానే ఇప్పుడు అఫీషియల్ పోస్టర్ తో రిలీజ్ డేట్ ని కన్ఫామ్ చేశారు.

దీన్ని బట్టి చూస్తే దేవర సినిమా వాయిదా పడినట్లే అని తెలుస్తోంది . సాధారణంగా దిల్ రాజు ఏం చేసినా పక్కా సమాచారం తోనే చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే దేవరా సినిమా పోస్ట్ పోన్ అవుతోంది కాబట్టి ఆస్థానంలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే అదే రోజు రష్మిక బర్త్ డే కూడా ఉందని నెటిజన్లు గ్రహించారు. దీంతో బర్త్ డే కానుకగా ఫ్యామిలీ స్టార్ మూవీ వస్తోందని.. మీమ్స్ కూడా క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు.. ఇకపోతే ఇదంతా యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ కూడా అదే రోజున ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అవుతుండడంతో సినిమాకి అదనపు పబ్లిసిటీ లభించింది అనడంలో సందేహం లేదు.

- Advertisement -

మరి రష్మిక బర్త్ డే రోజున రిలీజ్ అయ్యే ఫ్యామిలీ స్టార్ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఒకవేళ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అయింది అంటే మాత్రం విజయ్ కి రష్మిక అదృష్టంగా మారుతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు