Bhoothaddam bhasker narayana : ప్రేక్షకులపై మాకు నమ్మకం ఉంది – శివ కందుకూరి

శివ కందుకూరి హీరోగా పురుషోత్తం రాజ్ దర్శకత్వం లో వస్తున్న ఆ సినిమా “భూతద్దం భాస్కర్ నారాయణ” ఫైనల్ గా మార్చి 1న రిలీజ్ అయిపోతుంది. శివ కందుకూరి హీరోగా రూపొందిన ఈ యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ మంచి ప్రమోషనల్ కంటెంట్ తో హైప్ ని క్రియేట్ చేసింది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ ఈ సినిమాను నిర్మించారు. కొన్ని మర్డర్స్ మిస్టరీ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ట్రైలర్ ఇప్పటికే మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. ఆ బలంతోనే థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇక ఈ నేపథ్యంలో శివ కందుకూరి మీడియా తో తమ సినిమా గురించి ప్రస్తావిచడం జరిగింది.

సినిమా గురించి శివ కందుకూరి మాటల్లో..

హీరోగా మొదటిసినిమా చేసిన శివ సినిమా గురించి మాట్లాడుతూ తెలుగులో క్రైమ్ అండ్ డిటెక్టివ్ థ్రిల్లర్స్ చాలా వచ్చాయి. అయితే డిటెక్టివ్ అనేసరికి చంటబ్బాయ్, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఇలాంటి జోనర్ సినిమా చేయాలనుకున్నపుడు ఏదో యునిక్ నెస్ ఉంటే తప్పితే చేయకూడదని అనుకున్నానని, ఆ టైం లోనే భూతద్ధం భాస్కర్ నారాయణ కథ విన్నానని అన్నాడు. ఇక ఈ సినిమాలో ఒక మైథాలజీ ఎలిమెంట్ ఉంది. డిటెక్టీవ్ నేపథ్యంలో వచ్చిన ఇంతకు ముందు సినిమాల్లో ఇలాంటిది లేదు. అందువల్ల ఈ సినిమా ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుది అని అన్నాడు. ఇక మనం మన నిజ జీవితంలో చాలా సార్లు దిష్టి బొమ్మను చూస్తుంటాం. కానీ అసలు అది ఎందుకు ఉందనేది పెద్దగా పట్టించుకోము. దాని గురించి చాలా మందికి తెలీదు. దీని గురించి పురాణాల్లో ఒక కథను సినిమాకు దర్శకుడు అద్భుతంగా జోడించాడు. ఖచ్చితంగా ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామనే నమ్మకం వుంది. అలాగే మా సినిమాను ప్రేక్షకులు తప్పకుండ ఆదరిస్తారనే నమ్మకం మాకు ఉందని శివ కందుకూరి చెప్పడం జరిగింది.

- Advertisement -

ఈ టైటిల్ నే పెట్టడానికి కారణం..

ఈ సినిమా టైటిల్ గురించి హీరో మాట్లాడుతూ ఇందులో నా పేరు భాస్కర్ నారాయణ. ఆ పాత్రకు భూతద్ధం సైజు కళ్ళద్దాలు ఉంటాయి. దీంతో అందరూ భూతద్ధం భాస్కర్ నారాయణ అని పిలుస్తుంటారు. డిటెక్టివ్ అనేసరికి భూతద్ధంని వాడుతుంటాం. టైటిల్ కి పాత్రకు రెండిటికి ఆ యాప్ట్ గా సరిపోయింది. అందుకే ఈ టైటిల్ ని పెట్టామని అన్నాడు. ఇక మా సినిమా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ని ఆడియన్స్ అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. మా కంటెంట్ కి ఆడియన్స్ రెస్పాన్స్ కూడా బాగుంది. సినిమా ప్రమోషన్స్ ని కూడా కొత్తగా చేసాం. అందుకే ప్రేక్షకులు తమ సినిమాని ఆదరిస్తారనే నమ్మకం ఉంది అన్నాడు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు