Operation Valentine : వరుణ్ తేజ్ లాస్ట్ మూవీస్ బిజినెస్ చూస్తే షాక్.. టాప్ నుండి డౌన్..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ ఫైనల్ గా మరికొద్ది గంటల్లో రిలీజ్ అయిపోతుంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ రీసెంట్ గా బయటికి రాగా, ఈ సినిమా యొక్క బిజినెస్ వరుణ్ తేజ్ గత చిత్రాల కంటే తక్కువ అవడం గమనార్హం. అయితే వరుణ్ తేజ్ గత కొన్నాళ్లుగా ఫామ్ లో లేడన్న విషయం తెలిసిందే. దాని రిజల్ట్ మార్కెటింగ్ పై పడుతుందనుకోలేదు. అది కూడా ఆపరేషన్ వాలెంటైన్ లాంటి భారీ బడ్జెట్ సినిమాపై కూడా ఇలా పడుతుందనుకోలేదు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా ప్రిన్స్ వరుణ్ రీసెంట్ టైంలో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాఫ్స్ ని అందుకోవడం వల్ల తన మార్కెట్ ను కూడా భారీగా కోల్పోయాడు…

మార్కెట్ లాస్..

లాక్ డౌన్ కి ముందు వరుణ్ తేజ్ ఒకానొక టైంలో ఫిదా, తొలిప్రేమ, గద్దలకొండ గణేష్ లాంటి సూపర్ హిట్స్ తో మంచి జోరు చూపించగా, ఆ తర్వాత F2, F3 లాంటి మల్టీ స్టారర్ సినిమాలతో కూడా తన హవా చూపించాడు. అయితే ఆ తర్వాత ఎక్స్ పెరిమెంటల్ మూవీస్ రూట్ లో వెళ్ళడం స్టార్ట్ చేసిన వరుణ్ తేజ్ కి మంచి పేరు వచ్చినా, వరుస పెట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ సినిమాలు పలకరించాయి. ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన గని మరియు గాండీవధదారి అర్జున లాంటి సినిమాలు భారీ డిజాస్టర్ లు గా నిలవగా, వాటితో వరుణ్ తేజ్ మార్కెట్ కూడా చాలా డౌన్ అయిందని చెప్పొచ్చు.

- Advertisement -

ఒకప్పుడు వరుణ్ తేజ్ మార్కెట్ రేంజ్ 30 కోట్లకు పైగా ఉండగా, ఇప్పుడు అందులో సగం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇక తన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్ కేవలం 17 కోట్ల రేంజ్ లోనే వాల్యూ బిజినెస్ ను అందుకుంది. అయితే ఒకసారి వరుణ్ తేజ్ రీసెంట్ లాస్ట్ ఫైవ్ మూవీస్ బిజినెస్ లెక్కలను గమనిస్తే..

వరుణ్ తేజ్ లాస్ట్ ఫైవ్ మూవీస్ బిజినెస్ లెక్కలు ( సోలో హీరోగా )
ఆపరేషన్ వాలెంటైన్ 17కోట్లు,
గాండీవదారి అర్జున 17కోట్లు,
గని 25.30 కోట్లు,
గడ్డలకొండ గణేష్ 24.25కోట్లు,
అంతరిక్షం 19కోట్లు
తొలిప్రేమ 23కోట్లు..

ఇక వరుణ్ తేజ్ నాలుగేళ్ళ కింద నటించిన గద్దలకొండ గణేష్ , గని సినిమాల బిజినెస్ లు ఆల్మోస్ట్ 25 కోట్ల మార్క్ ని అందుకోగా, ఇప్పుడు ఆ రేంజ్ తగ్గిపోయి 17 కోట్ల రేంజ్ కి పడిపోయింది. ఇలాంటి టైంలో ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో వరుణ్ తేజ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అన్నిటికి మించి సోలో హీరోగా వరుణ్ తేజ్ కి ఒక బ్లాక్ బస్టర్ పడాలి. మరి ఈ సినిమాతో అన్ని రూమర్స్ కి చెక్ పెట్టి నిఖార్సైన హిట్టు కొడతాడేమో చూడాలి.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు