Varun tej : ఆపరేషన్ వాలెంటైన్ ఏరియా వైస్ బిజినెస్ లెక్క..

వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ ఎట్టకేలకు రిలీజ్ కాబోతుంది. అన్ని అడ్డంకులను దాటుకుని ఆపరేషన్ వాలెంటైన్ తెలుగు, హిందీ భాషల్లో మార్చి 1న రిలీజ్ అయిపోతుంది. అయితే ఈ సినిమా పై ప్రస్థుతానికి వరుణ్ తేజ్ రెగ్యులర్ సినిమాపై ఉన్నత హైప్ లేదన్నమాట వాస్తవం. పైగా ఈ సినిమా జోనర్ తెలుగు ఆడియన్స్ కి కొత్త అవ్వడంతో ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది ఆసక్తిగా మారింది. ఎందుకంటే అప్పట్లో కొత్త కాన్సెప్ట్ అని తీసిన ఘాజి సినిమా బాగా ఆడితే, ఆ తర్వాత స్పేస్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన అంతరిక్షం నిరాశ పరిచింది.

ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో వస్తుంది. ఆర్మీ నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చినా, ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న పూర్తి స్థాయి తెలుగు చిత్రం ఇదే. ఇక సినిమా కోసం చాలా కష్టపడిన వరుణ్ తేజ్ ప్రమోషన్స్ పరంగా కూడా అన్ని చోట్లకు వెళ్లి సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా డిజిటల్, సాటిలైట్ రైట్స్ అయితే మంచి ధరకు అమ్ముడు పోయాయి. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే ఈ సినిమా ఆల్ మోస్ట్ 23 కోట్లకు పైగా రికవరీ చేసుకుందని సమాచారం. అలాగే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ కూడా వచ్చాయి. అయితే అఫిషియల్ గా ఇంత అని కన్ఫామ్  లేదు. ఈ సినిమా వాల్యూ రేంజ్ 17 కోట్ల దాకా ఉంటుందని అంచనా. ఒకసారి సినిమా మేజర్ ఏరియాల వారి బిజినెస్ లెక్కలను గమనిస్తే…

- Advertisement -

ఆపరేషన్ వాలెంటైన్ థియేట్రికల్ బిజినెస్..
నైజాం : 4.5 కోట్లు
సీడెడ్ : 2 కోట్లు
ఆంధ్ర : 7.5 కోట్లు
టోటల్ తెలుగు రాష్ట్రాల్లో : 14.00 కోట్లు
కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియా కలిపి : 3 కోట్లు
టోటల్ గా వరల్డ్ వైడ్ గా 17 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని సమాచారం.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అంటే… 

మొత్తం మీద ఆపరేషన్ వాలెంటైన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర వాల్యూ బిజినెస్ రేంజ్ 17 కోట్ల దాకా ఉంటుందని అంచనా… ఈ లెక్కన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే ఓవరాల్ గా 18 కోట్ల రేంజ్ దాకా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. అయితే ఆన్లైన్ లో జరుగుతున్న బుకింగ్స్ చూస్తుంటే ఓపెనింగ్స్ జోరు అంతగా ఉండేటట్లు లేదు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే వీకెండ్ లోనే కనీసం అరవై శాతం రికవరీ చేస్తేనే అవకాశం ఉంటుంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి టాక్ తెచుకుంటుందో చూడాలి.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు