Vettaiyan Update : వెట్టాయన్ షూటింగ్ పూర్తి చేసిన రజనీకాంత్… నెక్స్ట్ ఏంటంటే?

Vettaiyan Update : తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తన తాజా చిత్రం ‘వెట్టాయన్’ షూటింగ్‌ను పూర్తి చేశారు. సెట్‌లో ఆయన చివరి రోజు షూటింగ్ పూర్తయ్యాక చిత్రబృందం ఘనంగా రజినీకాంత్ కు వీడ్కోలు పలికింది. దానికి సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూవీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ చిత్ర బృందంతో పాటు రజనీకాంత్ ఫోటోతో ఈ వార్తను పంచుకుంది.

బిగ్ బీ పార్ట్ కూడా పూర్తి

‘వెట్టాయన్’ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. ఇద్దరు స్టార్స్ ముంబైలో ఈ సినిమా షూటింగ్ చేశారు. వారం రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్‌ను ముగించారు బిగ్‌ బి. రజినీకాంత్, అమితాబ్ చివరిసారిగా 1991లో ‘హమ్’ అనే సినిమాలో కలిసి నటించారు. రీసెంట్ గా రజనీకాంత్, అమితాబ్ బచ్చన్‌ లు కలిసి ఉన్న కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. 30 ఏళ్ల తర్వాత రజనీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.

వాస్తవ సంఘటనల ఆధారంగా

వెట్టాయన్ వాస్తవ కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం. రీసెంట్ గా పది రోజుల పాటు తిరువనంతపురంలో ఈ మూవీ షూటింగ్ జరిగింది. అక్కడ రజనీకాంత్ సినిమా షూటింగ్ జరగడం ఇదే తొలిసారి. ఇక ఆ షెడ్యూల్ లో రజినీకాంత్, ఫహద్ ఫాజిల్ పై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

- Advertisement -

టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ‘వెట్టాయన్’లో రజనీకాంత్ టైటిల్ రోల్‌ నటిస్తుండగా, ఇదొక యాక్షన్ డ్రామా. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

vettaiyan update Rajinikanth wraps up Vettaiyan shoot
vettaiyan update Rajinikanth wraps up Vettaiyan shoot

నెక్స్ట్ ఏంటి?

వెట్టాయన్ మూవీ షూటింగ్ పూర్తి అయిపోవడంతో రజినీకాంత్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? అనే ఆసక్తి మొదలయ్యింది. కానీ ఈ మూవీ షూటింగ్ ఊహించిన దానికంటే ముందుగానే పూర్తయ్యింది. కొన్ని రోజుల క్రితమే వెట్టాయన్ షూటింగ్ పూర్తి కాకముందే రజినీకాంత్ కూలీ షూటింగ్ ను కూడా మొదలు పెట్టబోతున్నారు అని వార్తలు వచ్చాయి. ఫిల్మ్ వర్గాల టాక్ ప్రకారం కూలీ మూవీ జూన్ లో సెట్స్ పైకి వెళ్లబోతోంది అని, రజినీకాంత్ కొన్ని రోజుల పాటు గ్యాప్ లేకుండా రెండు సినిమాల షూటింగ్ ను చేయాల్సి ఉంటుందని రూమర్స్ విన్పించాయి. కానీ రజినీకాంత్ మాత్రం వెట్టాయన్ మూవీని జెట్ స్పీడ్ లో పూర్తి చేశారు. నెక్స్ట్ ఆయన కూలీ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.

రజినీకాంత్ 70వ మూవీ వెట్టాయన్ తరువాత ఆయన చేయబోతున్న మూవీ కూలీ. ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా, సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. అన్పరివు స్టంట్ డైరెక్టర్లుగా పని చేస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న కూలీ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా ఈ మూవీ టైటిల్‌ గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేయగా, మంచి రెస్పాన్స్ వచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు