Pooja Hegde : ఇప్పుడు లీక్ అయి ట్రెండ్ అవుతున్నందుకు ఫీల్ అవుతున్న ఆ ఇద్దరు?

టాలీవుడ్ లో ఈ ఇయర్ సంక్రాంతి కి రిలీజ్ అయిన మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ లలో “గుంటూరు కారం” సినిమా కూడా ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఈ సంక్రాంతికి భారీ అంచనాలతో విడుదలయింది. అయితే ఆడియన్స్ నుండి మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ భారీ ఓపెనింగ్స్ తో మంచి కలెక్షన్లు వసూలు చేసింది. ఇక ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో ముందు అనుకున్న హీరోయిన్ వేరే ఉన్నారు. ఆమె ఎవరో కాదు బుట్టబొమ్మ పూజ హెగ్డే. గుంటూరు కారం సినిమా యొక్క అప్డేట్స్ ముందు నుండి తెలుసుకున్న వారికి ఈ సినిమాలో పూజ హెగ్డే నటించిందని తెలిసి ఉండొచ్చు. కానీ మెజారిటీ అఫ్ కామన్ ఆడియన్స్ కి గుంటూరు కారం లో ఫస్ట్ హీరోయిన్ పూజ అని తెలియదు.

పూజా అవుట్.. శ్రీ లీల ఇన్.. మీనాక్షి ఎక్స్చేంజ్..

అయితే గుంటూరు కారం సినిమా మొదలైనప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే కంఫర్మ్ అయింది. అప్పటికి సినిమాకి పేరు కూడా పెట్టలేదు, కానీ పూజ హెగ్డే తో కొన్ని సీన్లు కూడా షూట్ చేసారు. ఇక శ్రీ లీల ఈ సినిమాలో అప్పుడు సెకండ్ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. ఇక తాజాగా ఈ సినిమాలో మహేష్ తో పాటు ఈ ఇద్దరు హీరోయిన్లు ఉండే ఒక స్టిల్ సోషల్ మీడియాలో లీక్ అయ్యి తెగ వైరల్ అవుతుంది. ఆ స్టిల్ లో మహేష్ బాబు ఇంట్లో ఉండగా పూజ హెగ్డే లంగావోణీ లో పక్కన నిల్చుంది. ఇక పూజ హెగ్డే చుడిదార్ లాంటి డ్రెస్ లో ఉంది. అయితే పూజ హెగ్డే సినిమా నుండి తప్పుకున్నాక పూజ స్థానంలో శ్రీ లీల ను రీప్లేస్ చేయగా, మరదలు స్థానంలో మీనాక్షి చౌదరి ని తీసుకున్నారు. ఇక ఆ తర్వాత హీరోయిన్ల పాత్రలేంటో తెలిసిందే.

- Advertisement -

ఇప్పుడు స్టిల్స్ చూసి ఫీల్ అవుతున్నారా?

కారణం ఏంటో తెలీదు గాని గుంటూరు కారం సినిమా నుండి మాత్రం పూజ హెగ్డే బయటికి వచ్చాక స్క్రిప్ట్ లో చాలా ఛేంజెస్ జరిగాయి. చాలా సీన్లు రీ షూట్ చేయాల్సి వచ్చింది. అయితే గుంటూరు కారం సినిమా వదులుకున్నందుకు పూజ హెగ్డే చాలా ఫీల్ అవుతుందని సోషల్ మీడియా జనాలు అంటున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా పూజ హెగ్డే కి సరైన సక్సెస్ లేదు. దాదాపు రెండేళ్లుగా ఇటు తెలుగులో, అటు హిందీలో కూడా చేసిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. ఈ క్రమంలో పూజ హెగ్డే గుంటూరు కారంలో అలాగే ఉండి ఉంటే తన ఖాతాలో ఒక హిట్టు సినిమా ఉండేది, అలాగే తెలుగులో మరిన్ని ఆఫర్లు వచ్చేవని నెటిజన్లు భావిస్తున్నారు.

Pooja Hegde Unseen Stills From Guntur Karam

ఇక పూజ హెగ్డే మాత్రమే కాకుండా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా బుట్టబొమ్మని తన సినిమా నుండి వెళ్ళిపోయినందుకు ఫీల్ అవుతన్నాడట. ఆమె సినిమాలోనే ఉండి ఉంటే, స్క్రిప్ట్ ఛేంజెస్ అయ్యేది కాదు, బహుశా ఇంతకంటే పెద్ద సక్సెస్ అయ్యి ఉండేదేమో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పైగా త్రివిక్రమ్ పూయాజ్ హెగ్డే ది సక్సెస్ ఫుల్ కాంబో కూడా. అరవింద సమేత, అలవైకుంఠపురంలో తర్వాత గుంటూరు కారంలో ఉండి ఉంటే హ్యాట్రిక్ కాంబో సక్సెస్ అయ్యేది. ఇక అప్పట్లో బుట్టబొమ్మ సినిమా నుండి తప్పుకున్నాక గురూజీ చాలా ఫీలయ్యాడని చాలా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు