Taapsee Pannu : ఓర చూపులతో గాలమేస్తున్న సొట్టబుగ్గల సుందరి

టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సొట్ట బుగ్గల ఈ చిన్నది చేసింది తక్కువ సినిమా అయినప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. టాలీవుడ్, తమిళ్ అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలలో వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది తాప్సి. అలాగే బిజెపి పార్టీకి వ్యతిరేకంగా అప్పట్లో సోషల్ మీడియాలో యుద్ధమే చేసింది.

తాప్సీ టాలీవుడ్ కెరీర్

టాలీవుడ్ ఇండస్ట్రీలో తాప్సి అతి తక్కువ కాలంలోనే పాపులారిటీ సంపాదించుకుంది. 2010 సంవత్సరంలో ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ తాప్సి. ఆ తర్వాత చాలానే తెలుగు సినిమాలు చేసింది. ఇక 2013 సంవత్సరంలో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. పింక్ సినిమాతో హిందీలో ఆమెకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. అయితే గత మూడు సంవత్సరాలుగా ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీ పైన దృష్టిపెడుతోంది. టాలీవుడ్ లో ఛాన్సులు వచ్చినప్పటికీ ఎక్కువగా సినిమాలు చేయడం లేదు.

- Advertisement -

తాప్సీ ప్రేమా వ్యవహారం

హీరోయిన్ తాప్సి దాదాపు పది సంవత్సరాలుగా మాథియాస్ ను లవ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2013 సంవత్సరంలో మాథియాస్ ను కలిసింది తాప్సి. ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఇక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారట. మార్చి చివర్లో రాజస్థాన్లో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా సోషల్ మీడియాలో కూడా హీరోయిన్ తాప్సి తన అంద చందాలను ఆరబోస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే… హాట్ అందాలను ఆరబోస్తోంది. అయితే తాజాగా వైట్ సారీ కట్టుకొని తన అంద చందాలను ఆరబోసింది హీరోయిన్ తాప్సి. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Taapsee Pannu's latest photos in saree went viral

Taapsee Pannu's latest photos in saree went viral

Taapsee Pannu's latest photos in saree went viral

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు