Pooja Hegde: మరో ఐటమ్ సాంగ్ లో పూజ హెగ్డే ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్న పూజా హెగ్డేకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. హీరోలకు తగ్గట్టుగా హైట్… అలాగే అందం పూజ హెగ్డే సొంతం. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి మంచి పాపులారిటీ వచ్చింది. అయితే ప్రస్తుతం తెలుగులో ఈ బ్యూటీకి అస్సలు ఛాన్సులు రావడం లేదు. దీంతో సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ముందుకు సాగుతోంది.

పూజా హెగ్డే కెరీర్

టాలీవుడ్ హీరోయిన్ పూజ హెగ్డే ఓ లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ముఖ్యంగా ముకుంద సినిమాతో మంచి విజయాన్ని అందుకొని స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేసింది. అక్కడ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చేసింది. పూజ హెగ్డే కెరీర్లో చాలా హిట్ సినిమాలే ఉన్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా చేసిన అలా వైకుంఠపురం సినిమాలో హీరోయిన్గా నటించి అందరిని నడిపించింది. ఈ సినిమా తర్వాత పూజ హెగ్డే కెరీర్ అత్యంత దారుణంగా తయారయిందని చెప్పవచ్చు.

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాడ్ టైం

ప్రస్తుతం హీరోయిన్ పూజ హెగ్డే కు టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాడ్ టైం నడుస్తోంది. గుంటూరు కారం సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పూజ హెగ్డే చివరి క్షణంలో…. ఈ సినిమా నుంచి బయటకు పోవాల్సి వచ్చింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా మొదట ఈ బ్యూటీని అనుకున్నారు. కానీ చివరి క్షణంలో ఈ ఛాన్స్ కూడా కోల్పోయింది పూజా హెగ్డే. దీంతో కెరీర్ లో ఎలాగైనా సెటిల్ అవ్వాలని వెయిట్ చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే పూజా హెగ్డే కు ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందట. రవితేజ హీరోగా చేస్తున్న ఓ సినిమాలో ఐటెం సాంగ్ కోసం పూజ హెగ్డేను అడిగారట. దీనికి పూజా హెగ్డే కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. కాగా ఇప్పటికే రంగస్థలం సినిమాలో పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఐటెం సాంగ్ హీరోయిన్గా పూజ హెగ్డే మారబోతుంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు