Rajinikanth: రజినీ గొప్పతనం..పేదల కోసం 12 ఎకరాల్లో..?

సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి.. ఆయన మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యంత సామాన్యుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి నేడు వేలకోట్లకు అధిపతి అయినప్పటికీ కూడా ఆయన తన పూర్వ జీవితాన్ని గడపడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.. అందుకే సామాన్య వ్యక్తి లాగా అందరిలో కలిసిపోయి.. తాను కూడా అందరిలో ఒకడినని పలు సందర్భాలలో నిరూపించారు కూడా.. అందుకే తన ఆస్తిపాస్తులను కూడా లెక్కచేయకుండా.. తన కూతుర్లు ఇద్దరినీ ఉన్నత స్థానానికి చేర్చి.. ఇప్పుడు తన సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును పేదల కోసం వినియోగించబోతున్నారు.. ఈ క్రమంలోనే పేదల కోసం చెన్నైలో భారీ స్థాయిలో పేదలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు..

హాస్పిటల్ కట్టించబోతున్న తలైవా..
తాజాగా రజనీకాంత్ పేదలకు అవసరమైన విద్య, వైద్యను అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే 12 ఎకరాలలో భారీగా హాస్పిటల్ నిర్మించబోతున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం తిరుప్పోరూర్ లో రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు. అక్కడ ఆయన కొత్తగా కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ని కూడా కంప్లీట్ చేశారు రజినీకాంత్ . ఇకపోతే అప్పుడు రజినీకాంత్ వస్తున్నారు అని తెలిసి ఆయనను చూడడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకోవడంతో.. ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇక ఈ సందర్భంగా రజినీకాంత్ అక్కడికి చేరుకోవడం తో..ఆ తర్వాత ఈ విషయం కాస్త లీకైనట్లు తెలుస్తోంది. ఇక దీని ప్రకారం చెన్నై ఓఎంఆర్ రోడ్ నుంచి దల్హంపూర్ వెళ్లే దారిలో 12 ఎకరాల భూమిని రజనీకాంత్ కొనుగోలు చేశారు. డిడి నమోదు చేసేందుకు రజనీకాంత్ ఇలా రిజిస్టర్ కార్యాలయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆ స్థలంలో రజనీకాంత్ ఒక పెద్ద ఆసుపత్రిని నిర్మించే పనిలో ఉన్నారట.

నాణ్యమైన ఉచిత వైద్యం..
ఆస్పత్రిలో పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ధనవంతులకు కూడా ఇక్కడ వైద్యం లభిస్తుంది కానీ వారి నుంచి డబ్బులు వసూలు చేస్తారని.. ఈ ఆసుపత్రిలో కేవలం పేదలకు మాత్రమే ఉచిత వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇకపోతే ఒకవైపు వరుసగా సినిమా షూటింగ్లలో బిజీగా ఉండడం వల్ల ఈ హాస్పిటల్ పనులను తన స్నేహితుడికి అప్పగించినట్లు సమాచారం

- Advertisement -

రజినీకాంత్ సినిమాలు..
ఇటీవలే తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో వచ్చిన లాల్ సలామ్ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన రజినీకాంత్.. సినిమా ఫ్లాప్ అయినా సరే ఈయన వల్లే సినిమా కొంతవరకు నెట్టుకొచ్చింది.డైరెక్టర్ టీ.జే.జ్ఞానవేల్ తో వెట్టయన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. షూటింగ్ పనులుRajinikanth is going to build a hospital for poor people కూడా మొదలైన ఈ చిత్రంలో రతికా సింగ్ , మంజు వారియర్, దసరా విజయన్ , రక్షన్, అమితాబ్ బచ్చన్, రానా తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.. అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తుండగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు