Rajinikanth: ప్రతి ఏడాది పెళ్ళి రోజున అలాంటి పని చేస్తున్న రజినీ దంపతులు..!

సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. చిన్నపిల్లవాడిని మొదలుకొని పెద్దవారి వరకు అందరూ రజనీకాంత్ అభిమానులే.. అంతలా తన నటనతో ప్రేక్షకులను మెప్పించి ఆకట్టుకున్నారు రజినీకాంత్.. 7 పదుల వయసులో కూడా ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్న రజనీకాంత్ ఒక ఇండియాలోనే కాదు జపాన్లో కూడా భారీ క్రేజ్ సంపాదించుకున్నారు.. అంతేకాదు జపాన్లో స్టార్ హీరోగా కూడా చలామణి అవుతున్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకి రూ .150 కోట్ల రేంజ్ లో పారితోషకం తీసుకుంటూ భారీగా సంపాదిస్తున్న ఈయన ప్రొఫెషనల్ లైఫ్ లోనే కాదు పర్సనల్ లైఫ్ లో కూడా సక్సెస్ఫుల్ మెన్ అనిపించుకున్నారు..

ఒక నటుడిగా సినిమా రంగంలో నిబద్దతతో నడిచిన రజనీకాంత్.. భర్తగా కూడా తన జీవిత భాగస్వామితో అలాగే నడుస్తూ వచ్చారు. 1981లో లతను వివాహం చేసుకున్నారు.. ఈమె కూడా సినిమా రంగంలో పని చేసిన వారే.. క్యాస్టింగ్ డిజైనర్ గా , ప్రొడ్యూసర్ గా, సింగర్ గా కూడా పనిచేసి సత్తా చాటారు.. ఇకపోతే ఈ సూపర్ జంట దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టి 43 సంవత్సరాలవుతుంది. ఇప్పటికీ ఏకతాటిపై ప్రయాణిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. వీరిద్దరికీ ఇద్దరు ఆడపిల్లలు.. వారు ఐశ్వర్య రజనీకాంత్, సౌందర్య రజనీకాంత్ .. ఇద్దరూ కూడా దర్శకులుగా వ్యవహరిస్తున్న వారే..

ఇదిలా ఉండగా ఈరోజు తమ అమ్మానాన్న పెళ్లిరోజు కావడంతో సౌందర్య రజనీకాంత్ ఒక ఆసక్తికర పోస్టు షేర్ చేసింది.. ఆ పోస్టుతో ప్రతి ఏడాది పెళ్లి రోజున రజనీకాంత్ దంపతులు ఏం చేస్తారో అందరికీ తెలియజేసింది.. ఇకపోతే రజనీకాంత్ దంపతులు తమ పెళ్లిరోజున ఏం చేస్తారు అన్న విషయం గురించి షేర్ చేస్తూ. తాజాగా తన అమ్మ నాన్నకు సంబంధించిన ఒక ఫోటోని షేర్ చేసింది సౌందర్య.. అందులో రజినీకాంత్ తన మెడలోని గోల్డ్ చైన్ , చేతికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ కనిపించారు. అలాగే లతా కూడా ఆమె చేతికి ఉన్న ఉంగరాన్ని చూపించింది. అవి 43 ఏళ్ల క్రిందట తమ పెళ్లి సమయంలో మార్చుకున్న ఉంగరాలట.. ప్రతి ఏడాది పెళ్లిరోజున వాటిని ధరించి.. తమ పెళ్ళి రోజును రజినీకాంత్ దంపతులు జరుపుకుంటారట. ఈ విషయాన్ని ఆమె షేర్ చేయగా ప్రస్తుతం ఈ విషయం అందరిని ఆకట్టుకుంటోంది.

- Advertisement -

Rajinikanth and his wife exchange rings on every wedding anniversary

ఇక రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే జై భీమ్ డైరెక్టర్ టీ.జే.జ్ఞానవేల్ తో తన 170 వ సినిమా వెట్టయన్ ను తెరకెక్కిస్తున్నారు.. ఇప్పటికే షూటింగ్ పనులు మొదలు కాగా సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇందులో రతికా సింగ్ , మంజు వారియర్, దసరా విజయన్ , రక్షన్, అమితాబ్ బచ్చన్, రానా తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.. ఇక ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.. ఇక త్వరలోనే సినిమా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు రజినీకాంత్.. ఇకపోతే ఈరోజు ఆయన పెళ్లి రోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు