Pawan kalyan : శివరాత్రికి ‘వీరమల్లు’డి ఆగమనం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు గత కాలంగా షూటింగ్ వాయిదా పడిందన్న విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేయలేదని ఎలక్షన్స్ ప్రభావం వల్ల కొంత గ్యాప్ ఇచ్చారని పవన్ కళ్యాణ్ తో చేస్తున్న చిత్ర నిర్మాతలు తెలిపారు. అయితే హరిహర వీరమల్లు పై మాత్రం అభిమానులు నమ్మకంగా లేరు. ఇది హిస్టారికల్ డ్రామా కాబట్టి ఈ సినిమాకు పీకే ఎక్కువ రోజులు డేట్లు కేటాయించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎలక్షన్ హడావిడి వల్ల పవన్ ఈ సినిమాని పూర్తిగా పక్కనపెట్టాడని లేనిపోని పుకార్లు వచ్చాయి.

ఇక హరీష్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ తో చేస్తున్న ఓజి సినిమాలు కమర్షియల్ కాబట్టి ఆ సినిమాలకు తక్కువ రోజులు కేటాయిస్తే సరిపోతుంది కాబట్టి, పవన్ ఆ సినిమాలే పూర్తి చేస్తారు అని వార్తలు వచ్చాయి. అయితే హరిహరవీరమల్లు నిర్మాత ఏ.ఎం రత్నం మాత్రం ఈ పుకార్లు అన్నీ నమ్మవద్దు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సినిమా పూర్తి చేస్తారని, అన్నీ కుదిరితే ఈ ఇయర్ చివర్లోనే సినిమా పూర్తి చేసి 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా హరిహర వీరమల్లు సినిమా నుండి తాజాగా ఓ ప్రోమో వీడియో ని మహా శివరాత్రి కానుకగా మార్చి 8న మేకర్స్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారని తెలిసింది. ఇక ఈ ప్రోమోలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ కూడా ఇవ్వొచ్చు. ఇటు ట్రేడ్ విశ్లేషకులు కూడా ప్రోమోలో రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తే రూమర్స్ అన్నిటికి చెక్ పెట్టినట్టు అవుతుందని అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు