RC16 : జాన్విని కన్ఫర్మ్ చేసిన బోనికపూర్!

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ లో దేవర సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా, బడా ప్రొడ్యూసర్ బోని కపూర్ గారాల పట్టిగా బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇప్పటివరకు సరైన హిట్ మాత్రం దక్కించుకోలేదు. అయితే తన గ్లామర్ షో బాగానే ఆకట్టుకుంది. గుంజన్ సక్సేనా లాంటి సినిమాలతో నటిగానూ మంచి మార్కులు కొట్టేసింది. ఇక తల్లి దండ్రుల సజెస్ట్ వల్లో లేక టాలీవుడ్ బాగా డెవలప్ అయిందనో తెలుగులో మాత్రం గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది.

ఫస్ట్ మూవీతోనే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ ఇస్తుందంటే, అది కూడా పాన్ ఇండియా మూవీ ద్వారా అంటే క్లిక్ అయితే సౌత్ లో ఒక్క సారిగా పది సినిమాలతో రచ్చ చేయడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే దేవర రిలీజ్ కాకముందే రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఆల్మోస్ట్ కంఫర్మ్ అయిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది కేవలం గాసిప్స్ మాత్రమే అని చాలా మంది అనుకున్నారు. కానీ తాజాగా జాన్వీ కపూర్ తండ్రి బోని కపూర్ ఈ విషయాన్నీ ఆఫీషియల్ గా కంఫర్మ్ చేసారు.

రీసెంట్ గా ఓ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో జాన్వీ తర్వాత సినిమా రామ్ చరణ్ తో ఉండబోతుంది అని చెప్పడం జరిగింది. ఈ విషయానికి సంబంధించిన వీడియో ఫ్యాన్స్ పేజీల్లో వైరల్ అవుతుంది. మరి చిత్ర యూనిట్ ఎప్పుడు కంఫర్మ్ చేస్తారో చూడాలి. దీన్ని బట్టి బోని కపూరే జాన్వీ కపూర్ ని తెలుగు సినిమాలు చేయమని ప్రోత్సహించాడని, సౌత్ సినిమాల గురించి బోని కపూర్ దగ్గరుండి చూసుకుంటున్నాడని తెలుస్తుంది. ఇక జాన్వీ కపూర్ ఈ రెండు సినిమాల్లో నటిస్తే సినిమాలు హిట్ అయినా, అవకపోయినా, స్టార్ బ్యాక్ గ్రౌండ్ వల్ల టాలీవుడ్ లో అయితే అరడజను చిత్రాలు వస్తాయి అని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు