Bhimaa : ఆ పోస్టర్ చూస్తుంటే ఏదో కొడుతుంది?

మ్యాచో స్టార్ ‘గోపిచంద్’ ప్రస్తుతం కన్నడ స్టార్ దర్శకుడు హర్ష దర్శకత్వంలో ‘భీమా’ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై రాధా మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 8న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక రిలీజ్ కి తక్కువ రోజులే ఉండడంతో చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్లలో బిజీ గా ఉన్నారు. ఇక భీమా సినిమాలో గోపీచంద్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇంతకు ముందు గోపిచంద్ పోలీస్ గా నటించిన సినిమాలన్నీ తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్సే.

ఇంతకు ముందు ఆంధ్రుడు, శౌర్యం, గోలీమార్ వంటి సినిమాల్లో పోలీస్ గా నటించాడు. అవి ఏ రేంజ్ హిట్ అయ్యాయో తెలిసిందే. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో భీమా వస్తుంది. ఇదిలా ఉండగా భీమా మూవీ నుండి లేటెస్ట్ గా ఒక పోస్టర్ రిలీజ్ అవుతుంది. ఆ పోస్టర్ లో గోపీచంద్ చాలా క్యాజువల్ గా కాస్త బెండ్ అయి నిలబడి విలన్లను పిలుస్తున్నట్టు ఆ పోజు ఉంది. సరిగ్గా చెప్పాలంటే ఆ సీన్ లో బహుశా హీరో విలన్లతో ఛాలెంజ్ చేసి ఉండవచ్చు. ఇంతకు ముందు గబ్బర్ సింగ్ లో హీరో విలన్లను ఛాలెంజ్ చేస్తూ కబడ్డీ ఆడుతూ ఇలాగే పిలుస్తూ వాళ్ళ అంతు చూస్తాడు. ఈ సీన్ రిఫరెన్స్ తో చాలా సినిమాల్లో ఇలాంటి సీన్లు వచ్చాయి.

అయితే అందులో చాలా వరకు బెడిసికొట్టి, ప్లాప్ అయ్యాయి. మరీ ఓపెన్ గా చెప్పాలంటే ఆ సీన్లు ఆడియన్స్ కి బోర్ కొట్టేశాయి. కానీ ఇప్పుడు భీమా లో అలాంటి సీన్ గనుక పెడితే ఆడియన్స్ దెబ్బైపోవడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో కంటెంట్ డిమాండ్ చేస్తే, లేదా దర్శకుడికి ప్రేక్షకుడ్ని కన్విన్స్ చేసే కెపాసిటీ ఉండి ఆ సీన్ చేస్తే ఓకే, కానీ పేరడీ సీన్ గనుక అయితే, అదే సినిమాకి పెద్ద మైనస్ అవుతుందని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. మరి మరో మూడు వారాల్లో రిలీజ్ కాబోతున్న భీమా ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు