Tapsee: కర్మ ఈజ్ బ్యాక్.. తాప్సీ గర్భం దాల్చావా అంటూ ట్రోల్స్..!

ఒక్కొక్కసారి మనం చేసే తప్పులే ఎదుటివారిని ఇబ్బంది పెడతాయి.. అయితే మనం వారి ఇబ్బందులను గమనించకపోయినా.. తప్పకుండా దేవుడు గమనిస్తాడు. అందుకే కర్మ మళ్లీ రిపీట్ అవుతుంది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఇలాంటి విషయాలు సినీ సెలబ్రిటీలకి చక్కగా వర్తిస్తాయి.. ఈ క్రమంలోనే గతంలో ఒక హీరోయిన్ పై తాప్సీ చేసిన కామెంట్లు ఇప్పుడు మళ్లీ తిరిగి ఆమెనే ఇబ్బంది పెడుతూ ఉండడం గమనార్హం.. నిజం చెప్పాలంటే అన్ని విషయాలలో కూడా కామెడీ పనికిరాదు. మరీ ముఖ్యంగా సున్నితమైన విషయాలలో ఆస్సలు జోకులు వేయకూడదు.. అయితే ఈ విషయంలో తెలిసి కూడా తాప్సీ పెళ్లిపై గతంలో జోకులు వేసింది.. ఇప్పుడు వాటికి ఫలితం అనుభవిస్తోంది.

గతంలో ఆమె వేసిన జోకులే ఇప్పుడు తనకు రివర్స్లో తలుగుతుంటే సోషల్ మీడియాలో సైలెంట్ అయింది. అసలు విషయం ఏమిటంటే.. తాప్సీ చాలా సంవత్సరాలుగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బో తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అతడితో ప్రేమలో ఉన్న విషయాన్ని ఇటీవలే బయట పెట్టింది. దీంతో పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న కామన్ అయిపోయింది.. గతంలో ఒకసారి ఇలానే తాప్సీ కి ఈ ప్రశ్న ఎదురవగా.. దీనిపై ఆమె వ్యంగంగా స్పందిస్తూ.. తాను ఇంకా గర్భవతిని కాలేదని.. గర్భం దాల్చినపుడు పెళ్లి చేసుకుంటాను అంటూ సెటైర్ వేసింది.. అయితే తాప్సీ ఇలా అనడానికి కూడా కారణం లేకపోలేదు. ఆ టైంలో అలియా భట్ తన గర్భం గురించి బయట పెట్టింది.. గర్భం దాల్చిన తర్వాతనే పెళ్లి చేసుకున్నానని ప్రకటించింది.. యాదృచ్ఛికంగా అదే సమయంలో ఇలియానా కూడా గర్భం దాల్చింది.. ఆ తర్వాతే ఆమె బిడ్డకు తండ్రిని ప్రకటించింది. ఇక వీళ్ళని దృష్టిలో పెట్టుకొని పరోక్షంగా సెటైర్ వేస్తూ స్పందించింది తాప్సీ..

అయితే ఇప్పుడు తన జోక్ తనకే రివర్స్ అయ్యింది.. ఇప్పుడు తాప్సీ పెళ్లిపై పుకార్లు మొదలయ్యాయి.. మార్చి మూడవ తేదీన తాప్సీ పెళ్లి చేసుకోబోతున్న ప్రచారానికి తెరలేపినట్టు అయింది.. దీనిపై తాజాగా తాప్సీ స్పందించింది.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎవరికి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని.. భవిష్యత్తులో కూడా తన ప్రైవేట్ లైఫ్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వనని స్పష్టం చేసింది.. అయితే ఇక్కడే నెటిజన్లు తమ తెలివితేటలను ప్రదర్శిస్తూ.. తాప్సీ గత ప్రకటనను కూడా గుర్తు చేస్తూ.. ఇంకా గర్భం దాల్చలేదా నువ్వు అంటూ సెటైర్లు వేస్తున్నారు.. గతంలో గర్భం దాల్చిన తర్వాతనే పెళ్లి చేసుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చావు కదా.. కొంపదీసి గర్భం దాల్చావా ?అందుకే పెళ్లికి సిద్ధమవుతున్నావా? అంటూ కూడా రివర్స్లో కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.. దీన్ని బట్టి చూస్తే కర్మ ఎక్కడికో పోలేదు.. తిరిగి మళ్ళీ ఆమెకే చుట్టుకుందనే వార్తలు స్పష్టమవుతున్నాయి.. ఏది ఏమైనా గతంలో ఇలియానా, ఆలియా భట్ లపై ఈమె వేసిన సెటైర్లు ఇప్పుడు ఈమెకే తగులుతూ ఉండడం గమనార్హం. ఇక వీటికి రిప్లై ఇవ్వలేక సైలెంట్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు