Directors: అనుకున్న డైరెక్టర్స్ మారిపోయిన సినిమాలు

కొన్నిసార్లు అనుకున్న కాంబినేషన్లో సినిమాలు వర్కౌట్ కావు. ఒక సినిమా చేద్దామని ఎన్నో డిస్కషన్స్ పెట్టుకొని, కథలు డిస్కస్ చేసుకొని, అన్ని రెడీ అయిన తర్వాత సెట్స్ మీదకు కూడా వెళ్లి, కొన్ని రోజులు షూట్ చేసిన తర్వాత సడన్ గా డైరెక్టర్ని మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు కోకొల్లలుగా ఉన్నాయి. ముందు ఒక డైరెక్టర్ తో అనుకొని మరో డైరెక్టర్ తో ఆ సినిమాను పూర్తి చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అప్పటికప్పుడు డైరెక్టర్ ను మార్చడానికి చాలా కారణాలు ఉంటాయి. అనుకున్న కథని అనుకున్న విధంగా తీయలేకపోవటం. ప్రొడ్యూసర్ తో ఇష్యూస్ రావడం ఇలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి.

ఇప్పుడు తెలుగు సినిమాలలో అలా చేయవలసిన డైరెక్టర్లు మారిన సినిమాలు లిస్ట్ తీస్తే చాలానే ఉంటుంది. మొదటగా రిక్షావోడు అనే సినిమాను స్టార్ డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వం వహించాల్సి ఉంది కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఆ సినిమాకి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు.

పవన్ కళ్యాణ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ సినిమా గబ్బర్ సింగ్.
ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే ఊపుతో సర్దార్ గబ్బర్ సింగ్ అనే సినిమాను రాసుకున్నాడు పవన్ కళ్యాణ్. అయితే ఈ సినిమాకి బాబి దర్శకత్వం వహించాడు. దీనికంటే ముందు ఈ సినిమాకి సంపత్ నంది దర్శకత్వం వహించాలి కానీ ఈ ప్రాజెక్టు డిలే అవుతూ వస్తుండటం వలన సంపత్ నందిని హోల్డ్ చేయడం కరెక్ట్ కాదు అని వదిలేసి ఈ అవకాశాన్ని బాబి కల్పించాడు పవన్ కళ్యాణ్.

- Advertisement -

నందమూరి బాలకృష్ణ నటించిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలను ముందుగా దర్శకుడు తేజ తెరకెక్కించాలి. అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఈ సినిమా మొదట్లోనే ఆగిపోయింది. దీనికి కారణం తేజ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బయోపిక్ జెన్యూన్ గా రావట్లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టులోకి కృష్ణ జాగర్లమూడి యాడ్ అయ్యాడు.

డాక్టర్ రాజశేఖర్ లేటెస్ట్ గా నటించిన సినిమా “శేఖర్” ఈ సినిమాకి లలిత్ దర్శకత్వం వహించాలి. కానీ ఈ సినిమాకి లాస్ట్ మినిట్ లో జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించాల్సి వచ్చింది. వాస్తవానికి ఈ సినిమా జోసెఫ్ అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది.

మాస్ కా దాస్ విశ్వక్సేన్ నటించిన సినిమా ధమ్కీ. ఈ సినిమాకి వాస్తవానికి నరేష్ కుప్పిలి అనే దర్శకుడు దర్శకత్వం చేయాలి. కానీ ఈ సినిమాను స్వయంగా విశ్వక్సేనే దర్శకత్వం వహించాడు. అయితే ఇదివరకే విశ్వక్సేన్ నటించిన పాగల్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు నరేష్ కుప్పిలి.

కళ్యాణ్ రామ్ లేటెస్ట్ ఫిలిం డెవిల్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ప్రశంసలను పొందుకుంది. ఈ సినిమాకి నవీన్ మేడారం దర్శకత్వం వహించాలి. పోస్టర్స్ పైన కూడా దర్శకత్వం నవీన్ మేడారం అని పడింది. కానీ చివరి నిమిషంలో వారి మధ్య ఉన్న కొన్ని డిఫరెన్సెస్ వలన ఈ సినిమాకు నిర్మాత అభిషేక్ నామ డైరెక్షన్ చేయవలసి వచ్చింది.

పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు మొదట ఎస్.జె.సూర్య దర్శకత్వం వహిస్తాడు అని వార్తలు వినిపించాయి. దీనికి కారణం అప్పటికే వీరిద్దరూ కలిసి రెండు సినిమాలు చేయటం. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఖుషి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ కొమరం పులి సినిమా మాత్రం అనుకున్న విజయాన్ని సాధించలేదు. వీరు మళ్ళి కాటంరాయుడు సినిమాకి కలుస్తారు అనుకునే తరుణంలో, అప్పటికే గోపాల గోపాల తో హిట్ ఇచ్చిన డాలీ తో ముందుకు సాగాడు కళ్యాణ్.

కంగనా రనౌత్ దర్శకత్వంలో వచ్చిన మణికర్ణిక సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకి తెలియంది కాదు. అయితే ఆ సినిమాను మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించాల్సి ఉంది.
ఆ సినిమాకు సంబంధించి చాలా పోర్షన్స్ కూడా క్రిష్ జాగర్లమూడి చేశాడంటూ వార్తలు వినిపించాయి. కానీ ఆ సినిమా డైరెక్షన్ మాత్రం కంగనా రనౌత్ పేరు ఉంటుంది.

విఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఆట సినిమాకు మొదట హరీష్ శంకర్ దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ కథ అది కాదు కానీ ఆ కాంబినేషన్లో హరీష్ శంకర్ కు ఆల్మోస్ట్ ఒక సినిమా సెట్ అయింది. కానీ ప్రొడ్యూసర్స్ తో కొన్ని డిఫరెన్సెస్ వలన ఆ సినిమాను హరీష్ వదిలేసాడు. ఆ టైంలో విఎన్ ఆదిత్య ఆట సినిమాను తెరకెక్కించారు.

ఇలా ఇండస్ట్రీలో ఒకరు దర్శకత్వం వహించాల్సిన సినిమాకి వేరొకరు దర్శకత్వం వహించిన సినిమాలు గురించి చెప్పుకుంటూ వెళితే ఎంతైనా ఉంటుంది. సో లైఫ్ లో ఏం జరిగినా మన మంచికే అనుకున్నట్లు. పైన చెప్పిన పర్సన్స్ లో చాలామంది సక్సెస్ఫుల్ ఉన్నారు. అలానే ఫెడ్ అవుట్ అయిన దర్శకులు కూడా ఉన్నారు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు