PawanKalyan : ఆ నిర్మాత ఊపిరి పీల్చుకోవచ్చు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుసగా హిట్ సినిమాలు చేసి యూత్ లో ఒక ట్రెండ్ సెట్ చేసిన స్టార్ హీరో. వరుస హిట్ సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ జానీ సినిమాతో దర్శకుడుగా కూడా తనలోని టాలెంట్ ను బయటకు తీశారు. అయితే జానీ సినిమా కమర్షియల్ గా హిట్ కాలేదు. కానీ టెక్నికల్ గా ఆ సినిమాను పవన్ కళ్యాణ్ తీసిన విధానం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

జానీ సినిమా తర్వాత దాదాపు 10 ఏళ్ల వరకు పవన్ కెరియర్ లో హిట్ సినిమా అంటూ లేకుండా పోయింది. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కమర్షియల్ గా కూడా మంచి కలెక్షన్స్ ను సాధించింది. ఆ సినిమా తర్వాత పవన్ కెరియర్ లో మళ్ళీ డిజాస్టర్ సినిమాలు వచ్చాయి.

ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అయింది. పవన్ కళ్యాణ్ స్టామినా అంటే ఇది అని బాక్స్ ఆఫీస్ కి రుచి చూపింది. రికార్డులకి కొత్త దారి చూపించింది. ఇప్పటికీ పవన్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమా అంటే గబ్బర్ సింగ్ అని చెప్పొచ్చు ఆ రేంజ్ ఇంపాక్ట్ ను క్రియేట్ చేసింది ఆ సినిమా.

- Advertisement -

ఆ తర్వాత కొన్ని డిజాస్టర్స్ తర్వాత అత్తారింటికి దారేది సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డుగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా పరవాలేదు అనిపించుకున్న రేంజ్ లోనే ఆడాయి. అయితే త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా సినిమాలకు కూడా దూరంగా ఉంటూ వచ్చారు.

మళ్లీ వకీల్ సాబ్ సినిమాతో రీయంట్రీ ఇచ్చి అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. రీయంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ వరుస సినిమాలకు సైన్ చేశారు. వాటిలో మూడు సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఇంకా చాలా సినిమాలు సెట్స్ పైనే ఉన్నాయి. ఇకపోతే పవన్ ప్రస్తుతం చేస్తున్న అన్ని ప్రాజెక్ట్స్ లో ఓజీ పైన ఎక్కువ అంచనాలు ఉన్నాయి.

రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ అయిన సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సుజిత్ స్వతహాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా. అయితే ఒక సగటు అభిమాని పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలనుకుంటున్నాడో అలా చూపించే ప్రయత్నం సుజిత్ చేసి ఉంటాడని చాలామందికి ఒక నమ్మకం ఉంది. అందుకోసమే ఈ సినిమా గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ పవన్ రాజకీయాల పనుల వలన కొంతకాలం బ్రేక్ తీసుకుంది. ఈ సినిమా కోసం పవన్ 15 రోజులు పూర్తిగా కేటాయిస్తాను అని నిర్మాత దానయ్యకు మాటిచ్చినట్లు సమాచారం వినిపిస్తుంది. దీంతో నిర్మాత దానయ్యకు ఒక హోప్ ఇచ్చినట్టు అయింది.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు