OG : గట్టిగానే సిట్టింగేసారుగా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో క్రేజీ అంచనాలున్న సినిమా ఏదంటే నిర్మొహమాటంగా అందరూ చెప్పే మాట “ఓజి”. సాహో ఫేమ్ సుజీత్ ఏ ముహూర్తాన ఈ సినిమాను మొదలుపెట్టాడో గాని ఓజి నుండి ఎలాంటి అప్డేట్ వచ్చినా ట్రెండ్ అయి కూర్చుంటుంది. పవన్ కళ్యాణ్ దాదాపు 13 ఏళ్ళ తర్వాత మరోసారి ఒక గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తుండడం వల్ల ఈ సినిమాపై ఎక్కడ లేని అంచనాలు పుట్టుకొచ్చాయి. పైగా టాలెంటెడ్ దర్శకుడు సుజిత్ స్టైల్ అఫ్ మేకింగ్ కి టాలీవుడ్ లో మంచి పేరు ఉంది. దానికి తోడు ఈ సినిమా క్యాస్టింగ్ కూడా ఓ రేంజ్ లో ఉంది.

టాలీవుడ్ మొదలుకుని బాలీవుడ్ వరకు, ఇంకా చెప్పాలంటే కోలీవుడ్ నటులు కూడా ఇందులో కీలక పాత్రలో నటిస్తుండడం వల్ల పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని తీర్చిదిద్దెందుకు మేకర్స్ ట్రై చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీ గా ఉండడం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని కొందరు అనుకున్నారు. కానీ మేకర్స్ మాత్రం ఈ సినిమా ఆగిపోలేదని షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయిందని పవన్ కళ్యాణ్ వీలైనప్పుడల్లా వచ్చి షూటింగ్ లో పాల్గొంటున్నారని క్లారిటీ ఇచ్చారు. ఇక తమ ఓజి సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుందని మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ కూడా చేసారు.

ఇదిలా ఉండగా తాజాగా ఓజి సినిమా మ్యూజిక్ పై డైరెక్టర్ సుజీత్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సెట్టింగ్ వేసినట్టు మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. దానికి కాప్షన్ గా 𝐊𝐢𝐥𝐥𝐢𝐧 𝐢𝐭 𝐮𝐩 𝐛𝐫𝐮𝐭𝐚𝐥 కూడా మెన్షన్ చేసారు. ఇటు ఫ్యాన్స్ కూడా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయితే బ్రేక్ ఇవ్వడానికి రెడీ గా ఉన్నామని ట్రెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్ సాంగ్ పవన్ ని ఎలివేట్ చేస్తూ ఉంటుందని, అందుకని ఎలక్షన్స్ కి కొన్ని రోజుల ముందు రిలీజ్ చేస్తే ఒక ప్రమోషన్ లా కూడా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నట్టు ట్రేడ్ విశ్లేషకుల సమాచారం. మరి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అప్డేట్ ఎప్పుడో మేకర్స్ నుండే క్లారిటీ రావాలి.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు