NTR: జూనియర్ ఎన్టీఆర్ సతీమణి బ్యాక్ గ్రౌండ్ తెలుసా..?

జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో చిత్రాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు. తన అద్భుతమైన నటనతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే లక్ష్మీ ప్రణతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. వివాహ అనంతరం ఎన్టీఆర్ వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియన్ స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. తనకు సంబంధించిన విషయాలను బయట ఎక్కడా పంచుకోరు. లక్ష్మీ ప్రణతి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

లక్ష్మీ ప్రణతి చంద్రబాబుకు చాలా దగ్గరి బంధువు అవుతారట. చంద్రబాబుకి లక్ష్మీ ప్రణతి వరుసకి మనవరాలు అవుతుంది. చంద్రబాబు మేనకోడలి కూతురే లక్ష్మీ ప్రణతి.ప్రణతికి అతి చిన్న వయసులోనే అంటే తన ఇంటర్ పూర్తికాగానే ఎన్టీఆర్ తో వివాహాన్ని ఫిక్స్ చేశారట. అంటే తాను మేజర్ అవ్వకముందే పెళ్లి చేయాలని అనుకున్నారట. కానీ ఎన్టీఆర్ అలా చేయడం తప్పని తాను మేజర్ అయిన తర్వాతనే వివాహం చేసుకుంటానని రెండేళ్లు గ్యాప్ తీసుకొని 2011 మే 5వ తేదీన వివాహం చేసుకున్నారట.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు