Tollywood: సుమంత్ – కీర్తి రెడ్డి విడిపోవడానికి కారణం ఇదే ?

అక్కినేని హీరో సుమంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇతను ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సుమంత్ సినిమాల్లో హీరోగా నటిస్తున్న సమయంలోనే తొలిప్రేమ సినిమా హీరోయిన్ కీర్తి రెడ్డితో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ ప్రేమించి కుటుంబసభ్యులను ఒప్పించే వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత అతితక్కువ కాలంలోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే వీరిద్దరూ విడిపోవడానికి గల కారణం నాగార్జుననే అంటూ ప్రస్తుతం పుకార్లు వస్తున్నాయి. దీనికి, నాగార్జునకి అసలు సంబంధం ఏంటి అని అంత షాక్ అవుతున్నారు. అయితే ఈ వార్తలపై ఇటీవల సుమంత్ క్లారిటీ ఇచ్చాడు.

వారిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగానే మేము విడిపోయామని,అంతేగాని ఇందులో ఎవరి ప్రభావం మా ఇద్దరు మీద లేదని సుమంత్ చెప్పాడు. ఇక సుమంత్ చాలా రోజుల తర్వాత “మళ్లీ రావా” సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమం సమయంలోనే కీర్తి రెడ్డితో విడిపోవడానికి గల కారణాలు బయటపెట్టాడు. మేమిద్దరం విడిపోయినప్పటికీ అప్పుడప్పుడు మాట్లాడుకుంటామని సుమంత్ చెప్పాడు. మా బంధం ఏడాదిన్నర మాత్రమే కొనసాగింది.

ఆ ఏడాదిన్నర సమయంలోనే మా ఇద్దరి జీవితాలు, అభిప్రాయాలు వేరని తెలిసింది. అందువల్లనే మేమిద్దరం ఎంతోకాలం కలిసి ఉండలేమని తెలిసిన వెంటనే మా కుటుంబసభ్యులతో మాట్లాడి విడిపోవాలని నిర్ణయించుకున్నాము. ఇక విడాకుల అనంతరం కీర్తి మళ్ళీ వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలతో చాలా సంతోషంగా ఉంది. ఆమె సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు. కీర్తి నేను ఇప్పటికీ టచ్ లోనే ఉంటాము. కీర్తి కుటుంబసభ్యులు నన్ను ఎంతగానో గౌరవిస్తారని సుమంత్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు