OG : ఇండస్ట్రీ హిట్ సీన్ రిపీట్ అవుతుందా?

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకుండే క్రేజ్ వేరన్న సంగతి తెలిసిందే. పీకే సినిమా వస్తుందంటే చాలు ఆ సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోయిన్ మరెవ్వరైనా పట్టించుకోరు.. విజయేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళే పవన్ కళ్యాణ్ కి ఫైట్లు, డాన్సులు, ఫైట్లు అవసరం లేదు, తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలు రికార్డులు కొట్టడానికి అన్నారు. అలాంటి పవర్ స్టార్ పాలిటిక్స్ వల్ల సినిమాలు గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది. లాస్ట్ ఇయర్ బ్రో లో ప్రత్యేక పాత్ర చేసాక మళ్ళి సినిమా చేయలేదు పవన్ కళ్యాణ్.

షూటింగ్ మధ్యలోనే ఉన్న హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు, ఓజి కూడా ఆగిపోయాయి. అయితే తాజాగా మేకర్స్ నుండి ఓజి రిలీజ్ డేట్ పై సమాచారం వచ్చింది. అఫిషియల్ గా అనౌన్స్ చేయకపోయినా, ఓజి సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం వచ్చింది. అయితే 2024 లో దసరా కంటే ముందు 27 నుండి లాంగ్ వీకెండ్ ఉండడంతో ఈ డేట్ ని లాక్ చేసారని తెలుస్తుంది. దీంతో పాటే కో ఇన్సిడెంటో లేక కావాలని ఆ డేట్ కి తెస్తున్నారో తెలీదు గాని పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్ సినిమా రిలీజ్ అయిన రోజు ఓజి వస్తుంది.

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబో లో వచ్చిన అత్తారింటికి దారేది 2013 సెప్టెంబర్ 27నే రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ సినిమాని బ్రేక్ చేయడానికి బాహుబలి రావాల్సి వచ్చింది. అలాంటి సినిమా వచ్చిన రోజు మళ్ళీ ఓజి వస్తుందంటే ఇండస్ట్రీ హిట్ సెంటిమెంట్ రిపీట్ అవ్వొచ్చు అని ఫ్యాన్స్ అప్పుడే లెక్కలు వేస్తున్నారు. పైగా పవన్ చేస్తున్న అన్ని సినిమాల్లో ఎక్కువ హైప్ ఉంది ఓజి పైనే. మరి సినిమా వచ్చే లోగా మేకర్స్ ఓజి ని ఏ రేంజ్ లో ప్రెజెంట్ చేస్తారో చూడాలి.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు