Namratha: గడ్డకట్టే చలిలో మహేష్.. భావోద్వేగంలో నమ్రత..!

Namratha

సూపర్ స్టార్ మహేష్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేసిన విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేసి పర్వాలేదనిపించుకున్నారు. కథ పరంగా ప్రేక్షకులను మెప్పించ లేకపోయిన ఈ సినిమా.. కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఇకపోతే మహేష్ బాబు ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన కొద్ది రోజుల క్రితం జర్మనీ వెళ్లారు అక్కడ డాక్టర్ గా పనిచేస్తున్న హ్యారీ కొనిగ్ ను మహేష్ బాబు కలుసుకున్నారు. మహేష్ బాబు బాడీ ఫిట్నెస్ కి సంబంధించిన డాక్టర్ హ్యారీ కొనిగ్ ని కలవడం రాజమౌళి మూవీ కోసమే అంటూ కొత్త అనుమానాలు మొదలయ్యాయి..

ప్రస్తుతం మహేష్ డాక్టర్ తో కలిసి ట్రెక్కింగ్ చేశారు..అందుకు సంబంధించిన ఫోటోలను కూడా మహేష్ బాబు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా… అందులో భాగంగానే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫోటోలను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు జర్మనీలోని బాడెన్ ప్రాంతంలో తన ఫిట్నెస్ డాక్టర్ హ్యారీ కొనిగ్ తో కలిసి బ్లాక్ ఫారెస్ట్ పర్వతంపై ట్రెక్కింగ్ చేశారు. గడ్డకట్టే చలిలో డాక్టర్ హ్యారీ తో కలిసి మహేష్ ఒక పెద్ద సాహసమే చేశారని చెప్పవచ్చు. ట్రెక్కింగ్‌ గురించి చెబుతూ మహేష్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.. ఇది చూసిన మహేష్ అభిమానులు రాజమౌళి మూవీ కోసం మహేష్ బాబు ఇంతలా కష్టపడుతున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ఎక్కువగా అడవి ప్రాంతంలోనే తెరకెక్కబోతోంది అంటూ ప్రముఖ రచయిత.. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే ..

Super star Mahesh Babu trekked up the Black Forest mountain in Germany

- Advertisement -

ఇక అందులో భాగంగానే మహేష్ బాబు ఇన్స్టాగ్రామ్ లో మహేష్ బాబు పోస్ట్ చేసిన ఫోటోలను చూసిన ఆయన భార్య ప్రముఖ హీరోయిన్ నమ్రత భావోద్వేగానికి గురయ్యారు నిన్ను చాలా మిస్ అవుతున్నాను అంటూ లవ్ ఎమోజీస్ తో ఎమోషనల్ గా కామెంట్ చేశారు నమ్రత.. ఇకపోతే ప్రస్తుతం నమ్రత షేర్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది ఇది చూసిన చాలా మంది గడ్డకట్టే చలిలో మహేష్ ని చూసి నమ్రత భావోద్వేగం అవుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మార్చి చివరలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో సెట్స్ మీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు