Mahesh Babu : జర్మనీకి మహేష్ సోలో జర్నీ… జక్కన్న కోసమేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు జర్మనీ సోలో జర్నీ జక్కన్న కోసమేనా? అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది ఫిలింనగర్ వర్గాల నుంచి. ఇంతకీ మహేష్ జర్మనీ ట్రిప్ ఎందుకు వేస్తున్నారు? అనే వివరాల్లోకి వెళితే…

ప్రస్తుతం మహేష్ బాబు తన నెక్స్ట్ మూవీని రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే రాజమౌళితో సినిమా అంటే ఏళ్లు పడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఆయనతో సినిమా చేయడానికి ముందు ఒక మంచి ఫన్ ఫిల్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీతో తన అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని భావించిన మహేష్ “గుంటూరు కారం” సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన విషయం తెలిసిందే. కానీ అందరి అంచనాలను నీరుగారుస్తూ ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మహేష్ అభిమానులకు అయితే ఈ సినిమా పెద్దగా నచ్చలేదు. అయితే నెగిటివ్ టాక్ ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ తో కలెక్షన్లు మాత్రం రాబడుతోంది “గుంటూరు కారం”. ఏదేమైనా సినిమాలో మహేష్ పాత్ర మాత్రం అదిరిపోయింది అనే కామెంట్స్ వినబడుతున్నాయి. ఇక ఈ సినిమా ఫలితంతో సంతోషంగా ఉన్న మహేష్ చిత్ర బృందానికి గ్రాండ్ పార్టీ కూడా ఇచ్చారు. ఇప్పుడు “గుంటూరు కారం” సినిమా నుంచి బయటపడి రాజమౌళి సినిమాపై కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మహేష్. ఈ నేపథ్యంలోనే ఆయన జర్మనీకి సోలో ట్రిప్ వేయడం చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా మహేష్ సినిమా సినిమాకు మధ్య కాస్త విరమం తీసుకుంటూ, ఆ గ్యాప్ మధ్యలో ట్రిప్ వేస్తూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాడు. కానీ ఈసారి మాత్రం మహేష్ ఒంటరిగా జర్మనీకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ట్రిప్ వెనుక మహేష్ అసలు ఉద్దేశం ఏమిటంటే రాజమౌళి సినిమాకు సంబంధించిన సాంకేతిక పనులను పర్యవేక్షించడం, వాటికి సంబంధించిన చర్చలలో పాలుపంచుకొని సినిమా గురించి లోతుగా అవగాహన ఏర్పరచుకోవడానికి అనేది తాజా సమాచారం. రాజమౌళి విజన్ కు జీవం పోయడానికి, జర్మనీలో మహేష్ ఈ సినిమా కోసం పని చేయబోయే వరల్డ్ క్లాస్ సాంకేతిక బృందంతో చర్చలలో పాల్గొనబోతున్నారట. మూడు రోజులపాటు మహేష్ జర్మనీ ట్రిప్ ఉంటుందని అంచనా. ఈ ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాజమౌళి, మహేష్ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అలా జక్కన్న కోసం, ఆయనతో చేయబోయే ప్రాజెక్ట్ కోసం ఇప్పటి నుంచే పని చేయడం ప్రారంభించాడు మహేష్. వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందని ప్రకటించినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు