Eagle Movie Release: మాట ఇచ్చారు కదా… నిలబెట్టుకోండి – ఈగల్ డిమాండ్

సంక్రాంతి పండుగ టైంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. గుంటూరు కారం మూవీకి పోటీ ఉండకూడదని నిర్మాతలు చాలా ట్రై చేశారు. ఫైనల్ గా… సోలో రిలీజ్ ఇస్తామనే మాట ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఇవ్వడంతో ఈగల్ మూవీ సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుని, ఫిబ్రవరి 09కి తన రిలీజ్ డేట్ ను మార్చకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇది ఫిల్మ్ ఛాంబర్ వాళ్లకు పెద్ద సమస్యలా మారిపోయింది.

ఫిబ్రవరి 09న నాగ వంశీ నిర్మాతగా వస్తున్న టిల్లు స్క్వేర్ మూవీ విడుదల కావాల్సింది. కానీ, ఇదే నాగ వంశీ నిర్మాతగా ఉన్న గుంటూరు కారం కోసం ఈగల్ తప్పుకోవడం, ఫిబ్రవరి 09కి సోలో రిలీజ్ కావాలని ఈగల్ టీం అడగడంతో తన టిల్లు స్క్వేర్ ను ఫిబ్రవరి 09 నుంచి వాయిదా వేశాడు.

ఇలా… ఫిబ్రవరి 09కి వచ్చే నాలుగు సినిమాల్లో ఈ ఒక్క సినిమానే రిలీజ్ డేట్ ను మార్చుకుంది. ఫిబ్రవరి 08న వచ్చే యాత్ర 2, ఫిబ్రవరి 09న వచ్చే ఊరు పేరు భైరవకోన, ఇదే ఫిబ్రవరి 09న వచ్చే లాల్ సలాం సినిమాలు ఎప్పటిలాగే తమ సినిమాలను ప్రమోషన్స్ చేస్తున్నాయి.

- Advertisement -

ఊరు పేరు భైరవకోన మూవీ టీం అయితే రిలీజ్ డేట్ గురించి తమను ఎవరూ సంప్రదించలేరని, తాము ఫిబ్రవరి 09న ఫిక్స్ అయిపోయామని, తమకు వేరే ఆప్షన్ కూడా లేదని చెబుతున్నారు. ఇక యాత్ర 2ను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. రిలీజ్ ను వీళ్లు చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. అలాగే లాల్ సలాం సినిమాలో రజినీకాంత్ ఉన్నాడు. రజినీనే టార్గెట్ చేస్తూ మూవీ టీం చాలా స్ట్రాంగ్ ప్రమోషన్స్ చేస్తుంది. కానీ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మాత్రం ఫిబ్రవరి 09ని ఈగల్ టీంకి ఇచ్చి, సోలో రిలీజ్ ప్రామిస్ చేసింది.

దీనిపై తాజాగా ఈగల్ ప్రొడ్యూసర్లు.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రియాక్ట్ అయ్యారు. తమకు మాట ఇచ్చినట్టు… సోలో రిలీజ్ కు సహకరించాలని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఫిల్మ్ ఛాంబర్ కు లేఖ రాశారు. దీంతో సంక్రాంతికి మించిన ఉత్కంఠ ఇప్పుడు ఫిబ్రవరి 09న ఉంటుంది. ఇతర సినిమాలు తప్పుకునే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. అలాగే ఈగల్ మరోసారి వాయిదా వేసుకోవడానికీ రెడీగా లేదు. దీంతో ఫిల్మ్ ఛాంబర్ దీనిపై ఎలా స్పందిస్తుంది? ఫిబ్రవరి 09న ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా ఉంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు