Ayodhya: రామ మందిర ప్రారంభోత్సవానికి ఇన్విటేషన్ అందిన స్టార్స్ లిస్ట్… ఎవరెవరికి ఆహ్వానం అందలేదంటే?

మరికొన్ని ఘడియల్లో దశాబ్దాల స్వప్నం సాకారం కాబోతోంది. విశ్వ ఆధ్యాత్మిక నగరిగా విరాజిల్లుతున్న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి కేవలం మరి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. జనవరి 22న అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ మహత్తర ఆధ్యాత్మిక ఘట్టం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టను కనులారా వీక్షించాలని ఉవ్విళ్లూరుతున్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ మహోత్సవానికి వివిధ రంగాలకు చెందిన ఏడువేల మంది ప్రముఖులు గెస్ట్ లుగా విచ్చేయబోతున్నారు. అందులో పలువురు సౌత్, నార్త్ యాక్టర్స్ కూడా ఉన్నారు. మరి సినీ ప్రముఖులు ఎవరెవరికి రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది అంటే…

దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు రతన్ టాటా, ముఖేష్ అంబానీ, వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరితో సహా మొత్తం 506 మందికి ఈ వేడుకకు ఆహ్వానం అందగా, వారందరికీ రాష్ట్ర ప్రభుత్వ అతిథి హోదాను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక బాల రాముడికి అయోధ్యలో పట్టాభిషేకం చేయబోతున్న స్టార్స్ ఎవరెవరు అన్న వివరాల్లోకి వెళితే… బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, సూపర్ స్టార్ రజినికాంత్, మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి, ధనుష్, ప్రభాస్, యష్, రామ్ చరణ్ దంపతులు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నిర్మాత మహావీర్ జైన్, నిర్మాత అభిషేక్ అగర్వాల్, అనుపమ్ కేర్, మాధురి దీక్షిత్, సంజయ్ లీలా బన్సాలి, రణదీప్ హుడా, రణబీర్ కపూర్, అనుష్క శర్మ, కంగనా రనౌత్, రిషబ్ శెట్టి, మధుర్ బండార్కర్, అజయ్ దేవగన్, జాకి ష్రాఫ్, టైగర్ ష్రాఫ్, ఆయుష్మాన్ ఖురానా, అలియా భట్, సన్నీ డియోల్, మోహన్ బాబులకు సినిమా పరిశ్రమ నుంచి ఆహ్వానం అందింది.

అయితే మరి కొంతమందికి మాత్రం ఈ వేడుకకు ఆహ్వానం అందకపోవడం చర్చకు దారి తీసింది. ఒకప్పటి రామాయణం సీరియల్ లో నటించిన నటీనటులు అరుణ్ గోవిల్, దీపిక చికాలియాలకు సైతం రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది. కానీ రణవీర్ సింగ్, దీపిక పదుకొనే, కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, శిల్పా శెట్టి, సంజయ్ దత్ వంటి బాలీవుడ్ స్టార్స్ కు ఈ వేడుకకు ఇన్విటేషన్ అందలేదు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే ఎన్టీఆర్, బాలయ్య, రాజమౌళి, మహేష్ బాబులకు ఆహ్వానం వచ్చిందా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు