Ayodhya: అయోధ్య కోసం మెగా “చిరు” కానుక..!

ప్రస్తుతం భారతదేశంలో ఎక్కడ చూసినా సరే ప్రజలు భక్తి మోడ్ లో పరవశించి పోతున్నారు. ఎందుకంటే శ్రీరాముల వారి జన్మస్థలమైన అయోధ్యలో రామ మందిరం ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యింది. కొన్ని కోట్ల మంది ప్రజలు ఈ ప్రారంభోత్సవం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అధిరథ మహారధులు ఈ ప్రారంభోత్సవానికి విచ్చేయబోతున్నారు. ఈ క్రమంలోనే అయోధ్య రామ మందిరంలో మొన్న కలశ పూజ జరగగా.. నిన్న రాముడు విగ్రహాలను ప్రతిష్టించారు.. రామ్ లల్లా పేరిట బాల రాముడిని అయోధ్య గర్భగుడిలో ప్రతిష్టించారు. ఇక ఈనెల 22వ తేదీన అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.

అందులో భాగంగానే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి కుటుంబానికి కూడా ఈ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. చిరంజీవి ఆయన సతీమణి సురేఖ తో పాటు చిరంజీవి వారసుడు ప్రముఖ గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ అలాగే ఆయన సతీమణి ఉపాసనలకు ఈ ఆహ్వానం అందింది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. ఇకపోతే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి మెగా కుటుంబానికి అయోధ్యకు రావాలని ఆహ్వానం అందగా వారు కూడా అయోధ్యలో తమ గుర్తుగా ఉండడానికి శ్రీరాములవారికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి చిరు కానుకగా ఇవ్వబోతున్నట్లు సమాచారం.

అంతేకాదు ఈ కానుక ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోవాలని.. మెగా కుటుంబం అనుకుంటుందట. అంతేకాదు అయోధ్యలో తెలుగువారి గుర్తులను ఉంచడం కోసం తెలుగువారి తరుపున మెగా కుటుంబం అరుదైన, అద్భుతమైన కానుకను అందించబోతుందని తెలుస్తోంది.. అంతేకాదు ఆ కానుక గురించి మరికొద్ది రోజుల్లోనే పూర్తి వివరాలు మెగా కుటుంబం వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా అయోధ్య కోసం మెగా కుటుంబం తీసుకున్న ఈ నిర్ణయానికి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాను చేస్తుండగా.. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు