Guntur Kaaram : జక్కన్నకు మరో తలనొప్పిగా మారిన “గుంటూరు కారం” రిజల్ట్

దిగ్గజ దర్శకుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ డైరెక్టర్ టాలెంట్ ఏంటో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు బాగా తెలుసు. కానీ ఇతర సినిమాల వల్ల ఈ డైరెక్టర్ పై పడుతున్న అపవాదులు రాజమౌళి అభిమానులను ఇబ్బంది పెడుతున్నాయి. తాజాగా టాలీవుడ్ లో “గుంటూరు కారం” రిజల్ట్ చూశాక రాజమౌళితో సినిమాలు చేయబోయే హీరోలకు కూడా ఫ్లాప్ తప్పదా? అనే అనుమానంతో మరో కొత్త సెంటిమెంట్ పుట్టుకొచ్చింది.

టాప్ డైరెక్టర్ రాజమౌళి ఇప్పటిదాకా అపజయం ఎరుగని దర్శకుడిగా సినిమా చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు. కెరీర్ మొదటి నుంచి ఇప్పటిదాకా ఈ డైరెక్టర్ చేసిన ప్రతి సినిమా కూడా ఒక దాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్ హిట్స్. కానీ ఈ డైరెక్టర్ తో సినిమాలు చేయబోయే హీరోలకు మాత్రం డిజాస్టర్ తప్పడం లేదు. నిజానికి ఎప్పటినుంచో రాజమౌళితో సినిమా చేసిన హీరోలకు ఆ తర్వాత ఒక అతి పెద్ద డిజాస్టర్ ఎదురవుతుంది అన్న సెంటిమెంట్ కొనసాగుతూ వస్తోంది. ఆయనతో ఇప్పటిదాకా సినిమాలు చేసిన పలువురు హీరోల విషయంలో అదే నిజమైంది కూడా. కానీ తాజాగా రాజమౌళితో సినిమాలు చేయబోయే హీరోల సినిమాల రిజల్ట్ విషయానికి కూడా జక్కన్న సెంటిమెంట్ ను ముడి పెడుతూ వస్తున్న వార్తలు చూస్తే నిజమే కదా అనిపిస్తుంది. దానికి ముఖ్య కారణం తాజాగా మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” రిజల్ట్.

త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబోలో వచ్చిన “గుంటూరు కారం” సినిమా మొదటి షో నుంచి నెగిటివ్ టాక్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ కలెక్షన్ల విషయానికి వస్తే ఇంకా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ కాలేదు. దీంతో రాజమౌళితో సినిమా చేసే హీరోలకు ముందు కూడా ఒక డిజాస్టర్ ఉంటుంది అనే టాక్ స్టార్ట్ అయ్యింది. మహేష్ బాబు నెక్స్ట్ మూవీ రాజమౌళితో చేయబోతున్న విషయం తెలిసిందే. అంతకుముందు రామ్ చరణ్ కూడా రాజమౌళితో “ఆర్ఆర్ఆర్” సినిమా చేసేముందు “వినయ విధేయ రామ” సినిమాతో భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంకాస్త వెనక్కి వెళ్తే… ఎన్టీఆర్ రాజమౌళితో “సింహాద్రి” సినిమా చేసేముందు “నాగ” అనే మూవీతో పరాజయం అందుకున్నాడు. మరో యంగ్ హీరో నితిన్ రాజమౌళితో చేసిన “సై” సినిమాకు ముందు “శ్రీ ఆంజనేయం” మూవీతో డిజాస్టర్ ను చవి చూడక తప్పలేదు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా రాజమౌళితో “ఛత్రపతి” సినిమాను చేసే ముందు “చక్రం” మూవీతో ప్లాఫ్ ఎదుర్కొన్నాడు. ఈ ఉదాహరణలు అన్నీ చూశాక రాజమౌళితో సినిమా చేసిన తర్వాత హీరోలు ప్లాప్ అందుకోవడం మాత్రమే కాదు, ఆయనతో సినిమా చేసే ముందు కూడా డిజాస్టర్ అందుకుంటారు అన్నది కొత్త సెంటిమెంట్ గా మారింది.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు