Prabhas : ఆ రెండు సినిమాల తరువాత బ్రేక్ తీసుకోబోతున్న డార్లింగ్?

డార్లింగ్ అభిమానులను టెన్షన్ పడుతున్న కొత్త వార్త ఏమిటంటే ప్రభాస్ త్వరలో మళ్లీ సర్జరీ చేయించుకోబోతున్నాడు. మరి ఆ వార్తల ప్రకారం ప్రభాస్ మరోసారి సర్జరీ చేయించుకుంటే ఆయన ప్రాజెక్ట్స్ పై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? అనే వివరాల్లోకి వెళితే…

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ “సలార్” సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ప్రభాస్ నెక్స్ట్ మూవీ గురించి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు. ప్రస్తుతం ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో “కల్కి”, మారుతి దర్శకత్వంలో “రాజా సాబ్” సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ మరోసారి సర్జరీ చేయించుకోబోతున్నారు అనే వార్త వైరల్ అవుతుంది. నిజానికి ప్రభాస్ గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన “బాహుబలి” సినిమా కోసం పడిన కష్టం కారణంగా మోకాలి నొప్పి సమస్య బాధపడుతున్నాడు. ఇటీవలే ఆ నొప్పి ఎక్కువ కావడంతో సర్జరీ చేయించుకున్నాడు. గత ఏడాది ప్రభాస్ ఈ సర్జరీ కోసమే విదేశాలకు వెళ్లి, నెల రోజులపాటు అక్కడే విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. “సలార్” సినిమా రిలీజ్ కోసం ఇండియాకు వచ్చినప్పటికీ పూర్తిగా కోలుకోకపోవడంతో ఆయన ఈ సినిమా ప్రమోషన్లలో పెద్దగా పాల్గొనలేదు.

ప్రస్తుతం ప్రభాస్ “కల్కి”, “రాజా సాబ్” సినిమాల షూటింగ్ లలో పాల్గొంటుండగా, మరోసారి ఆయనకు మోకాలి నొప్పి తిరగబెట్టిందని టాక్ నడుస్తోంది. దీంతో మరోసారి ఆయన సర్జరీ చేయించుకోబోతున్నాడు అనే ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న రాజా సాబ్, కల్కి సినిమాలను పూర్తి చేసిన తర్వాత ప్రభాస్ మోకాలి సర్జరీ కోసం యూరప్ వెళతాడని అంటున్నారు. ఇక ఇప్పుడు ప్రభాస్ లైనప్ లో సందీప్ రెడ్డి వంగ, హను రాఘవపూడితో చేయాల్సిన మరో రెండు సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలను టేకప్ చేయడానికి ముందు ఆయన కల్కి, రాజా సాబ్ సినిమాలను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడని, సమ్మర్ కానుకగా మే 9న రిలీజ్ కాబోతున్న “కల్కి” ప్రమోషన్స్ లో పాల్గొనడానికి ముందు ప్రభాస్ సర్జరీ చేయించుకుని, ఒక నెలపాటు రెస్ట్ తీసుకునే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. ఈ వార్తలపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరి ప్రభాస్ టీం ప్రస్తుతం జరుగుతున్న సర్జరీ ప్రచారంపై స్పందిస్తారా అనేది చూడాలి

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు