Raja Saab : “రాజా సాబ్”ను ఆ హీరో రిజెక్ట్ చేస్తే ప్రభాస్ దగ్గరకి వచ్చిందా?

యంగ్ రెబెల్ స్టార్ లేటెస్ట్ మూవీ “రాజా సాబ్” గురించి రోజుకో వార్త బయటకు వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్టోరీ గురించి డైరెక్టర్ మారుతీ వేసిన సెటైర్ పై టాలీవుడ్ లో చర్చ నడుస్తుండగా, తాజాగా ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని రిజెక్ట్ చేస్తే ఆ తర్వాత ప్రభాస్ దగ్గరకు వచ్చింది అనే రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది చివర్లో “సలార్” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకొని బౌన్స్ బ్యాక్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాల్లో “రాజా సాబ్” కూడా ఒకటి. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ హార్రర్ కామెడీ మూవీ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వివేక్ కూచిబొట్ల, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ సరసన తమిళ బ్యూటీ మాళవిక మోహనన్ నటిస్తుండగా, మరో ముగ్గురు హీరోయిన్లు కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఇటీవల విడుదలైన “రాజా సాబ్” ఫస్ట్ లుక్ డార్లింగ్ ఫాన్స్ లో జోష్ నింపేసింది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ మంచి ఎంటర్టైనింగ్ రోల్ కనిపించబోతుండడం ఆయన అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఫస్ట్ లుక్ లో ప్రభాస్ లుంగీ కట్టుకుని యంగ్ గా కనిపించడం సినిమాపై అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుండగా, ఈ నేపథ్యంలోనే “రాజా సాబ్” స్టోరీని నాని రిజెక్ట్ చేస్తే ప్రభాస్ దగ్గరకు వచ్చింది అనే ప్రచారం మొదలైంది.

ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం దర్శకుడు మారుతి ఈ సినిమా స్టోరీని పూర్తి చేసుకున్నాక ముందుగా నానికి కథను వినిపించాడట. కానీ నాని ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో అదే కథను పట్టుకుని మారుతి ఇంకొంత మంది హీరోల వద్దకు వెళ్లాడని, కానీ ఒక్కరు కూడా ఈ మూవీ స్టోరీపై ఆసక్తిని కనబరచలేదని అంటున్నారు. ఇక ఆ తర్వాత అదే కథను పలు మార్పులు చేర్పులు చేసి పూర్తిగా మార్చేసి ప్రభాస్ దగ్గరకు వెళ్లాడట మారుతి. ప్రభాస్ స్టోరీ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, అలా “రాజా సాబ్” పట్టాలెక్కిందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి అలా నాని రిజెక్ట్ చేసిన కథనే ప్రభాస్ తెరపైకి తీసుకువస్తున్నాడనేది తాజా రూమర్స్ సారాంశం. కానీ సినిమాలను ఎంచుకునే విషయంలో మంచి పట్టున్న నాని ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు అనే వార్త ఇప్పుడు ప్రభాస్ అభిమానులను టెన్షన్ పెడుతోంది. అయితే ఆ కథకు మార్పులు చేర్పులు చేసి పూర్తిగా ప్రభాస్ కు తగ్గట్టుగా మార్చేశాడు అనే మాటతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.

- Advertisement -

 

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు