Kanya West : ఒరిజినల్ పళ్లు ఏమయ్యాయి? ర్యాపర్ ను ఆడేసుకుంటున్న నెటిజన్లు

ఏకంగా 7 కోట్ల రూపాయలతో కొత్త టైటానియం పళ్ళ సెట్ ను వేయించుకున్న పాపులర్ ర్యాపర్ కాన్యే వెస్ట్ ను నెటిజెన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ర్యాపర్ కు పిచ్చి ఏమైనా పట్టిందా? అని షాక్ అవుతున్నారు.

కాన్యే వెస్ట్ అమెరికాకు చెందిన సింగర్, ర్యాపర్. ప్రపంచంలో అత్యధిక ఆల్బమ్ రికార్డులు అమ్ముడుపోయిన ర్యాపర్ లలో ఇతను కూడా ఒకరు. ఇప్పటిదాకా అతని ఆల్బమ్ లకు చెందిన 16 కోట్ల రికార్డులు అమ్ముడవడం విశేషం. హాలీవుడ్ నటీనటులు ఎంతో గౌరవంగా భావించే అత్యంత ప్రతిష్టాత్మకమైన 24 గ్రామీ అవార్డులు కూడా గెలుచుకున్నాడు. 1996లో తన మ్యూజికల్ కెరీర్ ను ప్రారంభించిన ఈ ర్యాపర్ కు ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా కెన్యా చేసిన పనిని చూసి అతని అభిమానులే దుమ్మెత్తి పోస్తున్నారు. ఇతనికి పిచ్చి పట్టింది అంటూ దారుణంగా ఆడేసుకుంటున్నారు. ఇంతకీ అతను చేసిన ఆ పిచ్చి పని ఏంటంటే… ర్యాపర్ కాన్యే వెస్ట్ తన పళ్ళు మొత్తం పీకించుకుని వాటి స్థానంలో కొత్తగా టైటానియం సెట్ వేయించుకున్నాడు. పైగా జేమ్స్ బాండ్ విలన్ నుంచి తాను ప్రేరణ పొంది ఈ పళ్ళ సెట్ వేయించుకున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ర్యాపర్ కాన్యే వెస్ట్ ఇంస్టాగ్రామ్ లో తన పళ్ళ సెట్టును మార్పించుకున్న విషయాన్ని బయట పెట్టాడు. ది స్పై హు లవ్డ్ మి, మూన్ బ్రేకర్ సినిమాలలో జేమ్స్ విలన్ అయిన జాస్ ఫోటోను షేర్ చేస్తూ అతన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని తన ఒరిజినల్ పళ్ళ సెట్ మొత్తాన్ని తీయించేసి, వాటి స్థానంలో కొత్తగా టైటానియం సెట్ వేయించుకున్నట్టుగా ప్రకటించాడు. ఈ టైటానియం పళ్ళ సెట్ విలువ ఏకంగా 8.5 లక్షల డాలర్లు. ఇండియన్ కరెన్సీ లో చూస్తే సుమారు 7 కోట్లు కావడం అందరిని షాక్ కి గురి చేస్తుంది. నిజానికి అతను ఇలా తన పళ్ళ సెట్ ను మార్పించుకోవడం ఇదే మొదటిసారి కాదు. 2010లో తన కింది పళ్ళ సెట్ మొత్తాన్ని మార్చేశాడు. అప్పట్లో ఈ విషయాన్ని కూడా ఓషో ద్వారా వెల్లడించాడు. ఇక ఆయన ఇంస్టాగ్రామ్ పోస్ట్ చూసిన అభిమానులు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. డబ్బులు బాగా ఎక్కువై ఏం చేయాలో తెలీక ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తున్నాడు అంటూ మండిపడుతున్నారు. ఈ ర్యాపర్ పిచ్చి ముదిరి ఇంకా రాను రాను శరీరంలోని ఏమేం పార్ట్స్ మార్పిడి చేయించుకుంటాడో అని సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి కెన్యా వెస్ట్ కి పిచ్చి పీక్స్ లోకి వెళ్ళింది అంటూ ర్యాప్ సాంగ్స్ లవర్స్ విమర్శిస్తున్నారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు