Janhvi Kapoor: సౌత్ స్టార్స్ నే పక్కకు నెట్టిన జాన్వీ.. మరీ ఇంత డిమాండ్..?

సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ నయనతార మినహా ఎవరు కూడా రూ.10 కోట్ల రేంజ్ లో పారితోషకం తీసుకోలేదు అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీస్ ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటూ భారీ పాపులారిటీ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీస్ మాత్రం సౌత్ ఇండియన్ సినిమాలలో నటిస్తే కచ్చితంగా ఆ రేంజ్ లో డిమాండ్ చేస్తున్నారటంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే సౌత్ స్టార్స్ ని పారితోషకం విషయంలో పక్కకు నెట్టి ముందుకు దూసుకుపోతోంది జాన్వీ కపూర్. చేసేది తెలుగులో మొదటి సినిమానే అయినా సౌత్ ఇండియన్ సీనియర్ హీరోయిన్స్ ని కూడా ఈ విషయంలో పక్కకు పెట్టేసిందని చెప్పాలి. ఇకపోతే జాన్వీ కపూర్ ఏ సినిమా కోసం ఈ రేంజ్ లో పారితోషకం తీసుకుంటుంది అనే విషయాలు ఇప్పటికే అర్థమై ఉంటాయి..

అతిలోకసుందరి అందాల తార దివంగత నటీమణి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె తన తల్లి కోరిక మేరకు తెలుగులో ఎన్టీఆర్ సరసన నటిస్తూ మొదటిసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం భారీగా డిమాండ్ చేస్తోందని సమాచారం.యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఇదివరకే జనతా గ్యారేజ్ సినిమా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే .ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ రిపీట్ కాబోతుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో దేవర అనే టైటిల్ తో సినిమా వస్తోంది. ఇందులో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గ్రామీణ యువతీ క్యారెక్టర్ లో నటిస్తోంది.

ఇకపోతే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస హాట్ ఫోటోషూట్స్ తో వరుస ఇంటర్వ్యూలతో ఎప్పుడు ట్విట్టర్ లో ట్రెండ్ క్రియేట్ చేసే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సౌత్లో ఫుల్ బిజీ అవుతుందని అందరూ భావిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం ఏకంగా రూ.10 కోట్లు పే చేస్తున్నారట దేవర టీం. అంతేకాదు టాలీవుడ్ హీరోయిన్స్ లో హైయెస్ట్ పేమెంట్ కూడా ఇదే కావడం గమనార్హం. పూజా హెగ్డే , రష్మిక , శ్రీ లీలా వంటి ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ కూడా కేవలం రూ .4కోట్ల వద్దే ఆగిపోతే.. వాళ్లందర్నీ దాటి ఈమె రూ.10 కోట్లకు వెళ్ళింది. అయితే దేవర రెండు భాగాలుగా రాబోతున్న నేపథ్యంలో రెండు భాగాలకు కలిపి మొత్తం రూ.10 కోట్లు తీసుకోబోతోంది జాన్వి కపూర్. ఏదిఏమైనా మొదటి సినిమాతోనే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుంది అంటే ఇక ఈమెకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా తర్వాత సూర్య, రాకేష్ ఓం ప్రకాష్ కాంబినేషన్లో మహాభారతం సినిమా, అలాగే బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న సినిమాలో కూడా జాన్వి కపూర్ నటించబోతోంది.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు