Mahesh Babu: బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయిన ఎక్స్పరిమెంటల్ మూవీస్

సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో ఎన్నో కమర్షియల్ సినిమాలు ఉన్నాయి. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అలాగే ఎన్నో ఎక్స్పరిమెంటల్ ఫిలిమ్స్ కూడా ఉన్నాయి. అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో మహేష్ బాబు చేసిన ఎక్స్పరిమెంట్ ఫిలిమ్స్ ఇంకెవరూ చేయలేదనేది వాస్తవం.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సందర్భంలో చెప్పినట్టు ” కొన్ని సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు కానీ ఒక యాక్టర్ గా మహేష్ బాబు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు” అని. అంటే ఒక మంచి సినిమాని ఆడియన్స్ కి ఇద్దామని ఎక్స్పరిమెంటల్ ఫిలిమ్స్ చేసి మహేష్ చాలా డిజాస్టర్స్ మూట గట్టుకున్నాడని మనకు ఇదివరకు తెలిసిందే.

మహేష్ బాబు కెరియర్ లో వచ్చిన మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మూవీ నాని. ఈ సినిమా కి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఎస్ జె సూర్య ఈ సినిమాను దర్శకుడుగా తెరకెక్కించాడు.అయితే ఈ సినిమా చాలామందిని ఆకట్టుకుంది గాని కమర్షియల్ గా హిట్ కాలేదు. ఈ సినిమాలో మహేష్ బాబు నటించిన తీరు అద్భుతం. చిన్నపిల్లాడిగా పెద్దోడిగా కనిపిస్తూ మహేష్ ఈ సినిమాని చాలా పర్ఫెక్ట్ గా యాక్టింగ్ చేశాడు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గారిని మిగిలిపోయింది.

- Advertisement -

టక్కరి దొంగ, ఈ సినిమా కూడా మంచి హిట్ అవుద్ది అనుకొని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య వచ్చింది. జయంత్ సి పరాంజి దర్శకత్వం వహించిన ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాలేదు. కానీ మహేష్ బాబు లుక్స్ మాత్రం ఈ సినిమాలో చాలా బాగుంటాయి.

వన్ నేనొక్కడినే, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై అంచనాలు బీభత్సంగా ఉండేవి. కానీ ఈ సినిమా ఊహించని రీతిలో డిజాస్టర్ పాలైంది. కానీ ఇప్పటికీ ఈ సినిమాకు ఉండే బ్రాండ్ వాల్యూ వేరు. ఈ సినిమాని అనవసరంగా ప్లాప్ చేశామంటూ చాలామంది ఇప్పటికి బాధపడుతుంటారు. ఈ సినిమా టెక్నికల్ గా చాలా బ్రిలియంట్ గా ఉంటుంది. మహేష్ కెరియర్ లో బెస్ట్ మూవీస్ లో ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చు.

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన సినిమా స్పైడర్. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ నుంచి సినిమా పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాలేదు. కానీ ఈ సినిమాలో చూపించినటువంటి మెసేజ్ కొంతవరకు ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ కి ఈ సినిమా నచ్చకపోవటం వలన ఇది కూడా డిజాస్టర్ గానే మిగిలింది.

ఈ నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయిన కూడా మహేష్ కి ఎటువంటి బ్యాడ్ నేమ్ రాలేదు. ఎందుకంటే డిఫరెంట్ అటెంప్ట్ చేసి ప్రేక్షకులను అలరించాడు అని ఒక కన్షన్ ఎప్పటికీ ఉంటుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు