Venkatesh: పండక్కొస్తున్నారట.. టైటిల్ కూడా అలాంటిదే?

టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేష్ కి ఇప్పుడు అర్జంట్ గా ఒక నిఖార్సైన హిట్ కావాలి. ఈ సంక్రాంతికి ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన “సైంధవ్” నిరాశపరచగా, వెంకీ అసలైన దమ్ము చూపించి కూడా చాలా కాలమైంది. లాస్ట్ ఇయర్ రానా నాయుడు వెబ్ సిరీస్ తో వివాదాలు మూటగట్టుకున్న ఈ ఫ్యామిలీ స్టార్ ఈ ఇయర్ మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాతో వచ్చినా బోరింగ్ స్క్రీన్ ప్లే తో అలరించలేకపోయాడు. అందుకే ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలనే కసితో సక్సెస్ ఫుల్ కాంబోని రిపీట్ చేయబోతున్నాడు. సైంధవ్ తర్వాత అందరూ వెంకీ ఎలాంటి మూవీ చేస్తాడో అని అందరిలో ఎంతో ఆసక్తి నెలకొని ఉండగా, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్ దర్శకుడు అనిల్ రావిపూడితో వెంకటేష్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.

ఈ మధ్యనే వెంకీ మామ కి స్క్రిప్ట్ ని వినిపించడం ఆయన ఒకే చెప్పడం కూడా జరిగిపోయాయట. ఒక మంచి కామెడీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రూపొందనుందట. పైగా వెంకటేష్ అనిల్ ది సక్సెస్ ఫుల్ కాంబో. వీరి కాంబో లో వచ్చిన F2, F3 బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసాయి. ఇప్పుడు హ్యాట్రిక్ కాంబోలో సినిమా వచ్చేస్తుందని తెలీగానే సినిమాపై అప్పుడే మంచి బజ్ క్రియేట్ అయిపొయింది కూడా. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుందని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి.

ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే, తాజాగా ఈ మూవీ యొక్క టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. వెంకీ అనిల్ హ్యాట్రిక్ కాంబో లో తెరకెక్కుతున్న ఈ మూవీకి “సంక్రాంతికి వస్తున్నాం” అనే టైటిల్ డిసైడ్ చేశారట. తొందర్లోనే ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించిన అన్ని వివరాలు అధికారికంగా చెప్పనున్నట్టు తెలుస్తోంది. ఇక దిల్ రాజు ఈ మూవీని నిర్మించే అవకాశం కనిపిస్తుంది. ఇటు వెంకటేష్ అనిల్ రావిపూడి తో మాత్రమే కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ సినిమా వాయిదా పడితే ఈ కాంబో సెట్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై కూడా తొందర్లోనే క్లారిటీ రానుంది.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు