Rashi singh : అతనే నా ఫేవరేట్ హీరో.. ఎప్పటికీ – రాశి సింగ్..

టాలీవుడ్ లో హీరోయిన్ గా చక్రం తిప్పుదామని కోటి ఆశలతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో “రాశి సింగ్” ఒకరు. ఇంతవరకూ ఒక్క సక్సెస్ సినిమా లేని ఈ భామ ఇప్పటికి కెరీర్ లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అయితే సినిమాలు హిట్ కాకపోయినా తన గ్లామర్ షో తో మెప్పిస్తూ అవకాశాలు అందుకుంటుంది రాశి సింగ్. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సినిమాల్లోకి రాకముందు తాను ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం చేశానని, అయితే చిన్నతనం నుండి సినిమాలు అంటే ఇష్టం కాబట్టి, హీరోయిన్ కావాలని ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాను అని చెప్పింది.

అయితే ఈ ఇంటర్వ్యూ లో రాశి సింగ్ తన ఫెవరేట్ హీరో ఎవరూ అన్న విషయం కూడా బయటపెట్టింది ఈ భామ. టాలీవుడ్ లో తన ఫేవరేట్ హీరో రామ్ చరణ్ అని చెప్తూ, లైఫ్ లో ఒక్కసారైనా రామ్ చరణ్ తో నటించాలని ఉందని చెప్పింది. ఒక్క టాలీవుడ్ నుండే కాదు ఇండియా వైడ్ గా చూసిన రామ్ చరణే నా ఫేవరేట్ క్రష్ అని రాశి సింగ్ చెప్పింది. ఇక RRR తర్వాత రామ్ చరణ్ ఇండియా వైడ్ గా అన్నిచోట్ల తన క్రేజ్ ని పెంచుకున్నాడు. ఇక రాశి సింగ్ నటించిన లేటెస్ట్ మూవీ రిలీజ్ కి రెడీ అయింది.

శివ కందుకూరు నటించిన ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ చిత్రంలో రాశి
హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ముంబై భామ అయినా కూడా తెలుగులో వరుస అవకాశాలు వస్తుందడంతో హైదరాబాద్లోనే నివాసం ఏర్పరచుకున్నట్టు తెలుస్తుంది. ఇక “భూతద్దం భాస్కర్ నారాయణ” మార్చి 1న ప్రేక్షకుల ముందుకువస్తోంది. రాశి సింగ్ ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ, ఈ సినిమాలో నాది బలమైన పాత్ర అని, పేరు లక్ష్మి అని చెప్పింది. శివకందుకూరితో కలిసి నటించడం హ్యాపీగా ఉందని, వినయం, ఓపిక ఉన్న నటుడు. ఆయన సినిమా కోసం కష్టపడ్డారు. ఈ చిత్రం తప్పకుండా మంచి విజయాన్నిస్తుందనే నమ్మకముందని చెప్పుకొచ్చింది రాశి సింగ్. మరి ఈ సినిమాతోనైనా రాశి సింగ్ మంచి హిట్ కొడుతుందా లేదా అనేది చూడాలి.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, et

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు