Rashi singh : “ఆది పురుష్” పై దారుణంగా కామెంట్స్ చేసిన హీరోయిన్..

టాలీవుడ్ లో హీరోయిన్ గా అదృష్టాన్ని పరీక్షించుకుందామని వచ్చిన చాలా మంది హీరోయిన్లలో రాశి సింగ్ ఒకరు. ఈమె గురించి ఎక్కువమందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే చేసిందే నాలుగు సినిమాలాంటే అందులో ఒక్క సక్సెస్ కూడా లేదు. తాజాగా “భూతద్దం భాస్కర్ నారాయణ” అనే సినిమాలో హీరోయిన్ గా మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. శివ కందుకూరి హీరోగా నటించిన ఈ యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ మంచి ప్రమోషనల్ కంటెంట్ తో క్రేజీ బజ్ ని క్రియేట్ చేస్తోంది. మార్చి 1న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా యొక్క ప్రమోషన్లు జోరుగా జరుగుతున్నాయి.

అయితే తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో హీరోయిన్ రాశిసింగ్ ఓ బడా సినిమాపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. వివరాల్లోకి వెళితే శివకందుకూరి హీరోగా నటించిన భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాని పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించాడు. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో హీరోయిన్ రాశి సింగ్. తమ సినిమా గురించి మాట్లాడుతూ ఓ పెద్ద సినిమాపై కామెంట్స్ చేసింది. ఆ సినిమా ఏదో కాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా గురించే. ప్రెస్ మీట్ లో రాశి సింగ్ మాట్లాడుతూ.. ఒక పెద్ద హీరో, పెద్ద బడ్జెట్.. పెద్ద స్టాప్ ఉన్నప్పటికీ ‘ఆదిపురుష్’ మూవీ లో విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఘోరంగా అనిపించాయి. నేను చూసిన చిన్న సినిమాల్లో కూడా అంత ఘోరమైన గ్రాఫిక్స్ వర్క్ చూడలేదు. కానీ వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమాకి అంత చెత్త గ్రాఫిక్స్ వర్క్ వాడతారు అనుకోలేదు అంది. ఆది పురుష్ లో చూసినంత చెత్త VFX వర్క్స్ నేను ఎక్కడ చూడలేదు అంది.

అయితే తాను నటించిన ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ సినిమాలో మాత్రం VFX చాలా క్వాలిటీగా అనిపిస్తాయి. నిర్మాతలు వాటి విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాలేదు. పెద్ద సినిమాకి ఎలా బడ్జెట్ పెడతారో.. ఈ సినిమాకి కూడా అలాగే బడ్జెట్ పెట్టారు”.. అందుకే తమ సినిమాకు బెస్ట్ అవుట్ ఫుట్ వచ్చింది అని చెప్పింది. అయితే ఆది పురుష్ పై అన్న వ్యాఖ్యల్లో నిజమున్నా, ఇప్పుడు దాని ప్రస్తావన మళ్ళీ ఎందుకని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే చిన్న సినిమా వైరల్ కావడానికి ఏదో పెద్ద వివాదాన్ని గెలికితే దాంతో పాటు వాళ్ళు కూడా వైరల్ అవుతారు కాబట్టి, ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా ఇదే చేసారు అని నెటిజన్లు భావిస్తున్నారు.

- Advertisement -

ఇక ఈ భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా ని స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించడం జరిగింది. ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏజెంట్ నేపథ్యంలో తెరకెక్కిన కామెడీ డ్రామా. గతంలో నవీన్ పోలిశెట్టి నడిచిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాని పోలి ఉంటుంది ఈ సినిమా. ఇక ఈ చిత్రం మార్చి 1న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి టాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తుంది రాశిసింగ్.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, et

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు