Ye Maya Chesave : 14 యేళ్ల క్లాసిక్ హిట్టు బొమ్మ.. కలెక్షన్స్ ఎంతో తెలుసా!

అక్కినేని నాగచైతన్య సమంత జంటగా నటించిన “ఏమాయ చేసావే” ఎంత పెద్ద క్లాసిక్ హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగచైతన్య కి ఫస్ట్ సూపర్ హిట్ ఇచ్చిన సినిమా మాత్రమే కాకుండా, లవర్ బాయ్ ఇమేజ్స్ ఉన్న అక్కినేని ఫ్యామిలీ కి మూడో జెనరేషన్ సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ అవుతుందని భరోసా ఇచ్చిన సినిమా. ఇక సమంత ఈ సినిమాతోనే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల క్రష్ లిస్టులో జాయిన్ అయిన సామ్ ఇప్పుడు టాలీవుడ్ లో ఎలాంటి హవా చూపిస్తుందో తెలిసిందే. ఈ ఇద్దరి ప్రేమ చిగురించడానికి కారణమైన ఈ సినిమా అప్పట్లో థియేటర్లో ఎంత బాగా ఆడిందో 90స్ ఆడియన్స్ కే తెలుసు.

గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘ఇందిరా ప్రొడక్షన్స్’ బ్యానర్ లో మహేష్ బాబు అక్క అయిన ఘట్టమనేని మంజుల నిర్మించడం జరిగింది. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్ని చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పటికి టాలీవుడ్ బెస్ట్ లవ్ స్టోరీస్ లో ఒకటిగా నిలిచే ఈ చిత్రం అప్పట్లో ఎలాంటి అంచనాలు లేకుండా 2010 ఫిబ్రవరి 26న విడుదలై మౌత్ టాక్ తో జనాల్ని థియేటర్లకు రప్పించింది. అన్ సీజన్ అయిన ఫిబ్రవరిలో రిలీజ్ అయినప్పటికీ అప్పట్లో భారీ కలెక్షన్లను సాధించి నేటికీ 14 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా, ఆ రోజుల్లో లాంగ్ రన్ లో మొత్తం టోటల్ రన్లో ‘ఏమాయ చేసావె’ బాక్సాఫీస్ వద్ద ఎంత వరకు కలెక్షన్స్ వసూలు చేసిందో ఏరియా వారీగా ఒక్కసారి గమనిస్తే..

నైజాం 3.50 cr, సీడెడ్ 1.73 cr, ఉత్తరాంధ్ర 1.28 cr, ఈస్ట్ 0.54 cr, వెస్ట్ 0.58 cr, గుంటూరు 1.23 cr, కృష్ణా 0.66 cr, నెల్లూరు 0.47 cr రాబట్టగా, మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా 9.99 కోట్ల షేర్, రెస్ట్ ఆఫ్ ఇండియా లో 80 లక్షలు, ఓవర్సీస్ లో 1 కోటి కలుపుకుని, వరల్డ్ వైడ్ గా 11.79 కోట్ల షేర్ రాబట్టగా, 23 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. ఇక ‘ఏ మాయ చేసావె’ చిత్రానికి రూ.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగగా, ఫుల్ రన్లో రూ.11.79 కోట్ల షేర్ కలెక్ట్ చేసి బయ్యర్లకి రూ.2.79 కోట్ల లాభాలను అందించింది. ఇక ఈ సినిమాని అప్పట్లో 10 కోట్ల బడ్జెట్ లో నిర్మించగా, థియేట్రికల్ రైట్స్ ద్వారా డీసెంట్ లాభాలు రాగా, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ద్వారా మాత్రం నిర్మాత బాగా లాభ పడ్డారు.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు