Raviteja: ఓటీటీ వాలనున్న ఈగల్

మాస్ మహారాజా రవితేజ. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా పూరి జగన్నాథ్ రవితేజకు బ్రేక్ ఇచ్చాడు. పూరీ జగన్నాథ్ రవితేజ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి. దేవుడు చేసిన మనుషులు మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ మంచి హిట్లు అని చెప్పొచ్చు.

ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నెగిటివ్ ఫ్యాన్ బేస్ లేని తక్కువ మంది హీరోల్లో రవితేజ ఒకరు. అందరు ఫ్యాన్స్ రవితేజ ను ఆదరిస్తారు. అందరు ఫ్యాన్స్ రవితేజ సినిమాలు చూస్తారు. రవితేజ సినిమా అంటే మినిమం గ్యారంటీ అని అందరికీ ఒక స్థాయి నమ్మకం వచ్చేసింది. అందుకే రవితేజ సినిమా ఫస్ట్ డే కి అందరు ఫ్యాన్స్ నుంచి టిక్కెట్లు తెగుతాయి.

ఇక రవితేజ వ్యక్తిగత విషయంలో కూడా చాలా కూల్ గా ఉంటారు. చాలా హుందాగా ప్రవర్తిస్తారు. చాలామంది దర్శకులను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత రవితేజది అని చెప్పొచ్చు. రవితేజ పరిచయం చేసిన డైరెక్టర్లు ఇప్పుడు స్టార్ హీరోలతో పనిచేసి ప్రూవ్ చేసుకున్నారు. వారిలో బాబి,గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్ వంటి దర్శకులు ఉన్నారు.

- Advertisement -

రవితేజకు హిట్టు ప్లాప్ తో సంబంధం లేదు. వచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఆయనకు తెలిసింది. ప్రస్తుతం రవితేజ సినిమాలు మీద సినిమాలు చేస్తూ మంచి బిజీగా ఉన్నాడు. ఇక రవితేజ నుంచి లేటెస్ట్ గా వచ్చిన సినిమా ఈగల్. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. కానీ కొంతమంది పబ్లిక్ కి మాత్రం విపరీతంగా నచ్చింది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ తీసుకుంది. త్వరలో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. థియేటర్లో అనుకున్న ఆదరణ లభించిన ఈ సినిమా, ఓటీటీలో ఎంతవరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు