Ravi teja : మాస్ మహారాజాకు నిర్మాతగా కూడా కలిసిరాలేదు పాపం 

మాస్ మహారాజా రవితేజ టైం ఈ మధ్య కాలంలో అస్సలు బాలేదు. ఆయన గత కొంతకాలంగా వరస డిజాస్టర్ లతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలతో హ్యాట్రిక్ డిజాస్టర్ లను తన ఖాతాలో వేసుకున్నాడు రవితేజ. ఈ ఎనర్జిటిక్ హీరో నటించిన సినిమాల పరంగా ఎలాగూ నిరాశ తప్పలేదు. కనీసం ప్రొడ్యూసర్ గా నైనా కలిసి వస్తుందేమో అనుకుంటే అక్కడ కూడా రవితేజకు ఎదురు దెబ్బే తగిలింది.

రవితేజ తన సొంత బ్యానర్ రవితేజ టీం వర్క్స్ ను కొంతకాలం క్రితం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్ ద్వారా ఆయన సరికొత్త కంటెంట్ ను తెరపైకి తీసుకురావాలని, టాలెంట్ ఉన్న యంగ్ స్టార్స్ ను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం హీరోగా బిజీగా ఉన్నప్పటికీ, ఆర్టి టీం వర్క్స్ బ్యానర్ పై గట్ట కుస్తీ, చాంగురే బంగారు రాజా, సుందరం మాస్టర్ అనే మూడు సినిమాలను నిర్మించారు. అయితే ఆ మూడు సినిమాలు కూడా డిజాస్టర్ గా నిలిచి రవితేజను నిర్మాతగా కూడా కష్టాల్లో పడేలా చేశాయి. అయితే ఈ మూడు సినిమాలు కూడా దేనికవే ప్రత్యేకమైనవి.

కానీ ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఇక గత శుక్రవారం విడుదలైన “సుందరం మాస్టర్” మూవీ కథపరంగా ప్రశంసలు అందుకుంది కానీ, కథనం మాత్రం ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. సినిమాపై మంచి అంచనాలే ఉన్నప్పటికీ ఫస్ట్ షోతోనే “సుందరం మాస్టర్”కు నెగటివ్ టాక్ స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా పరిస్థితి చూస్తుంటే డిజాస్టర్ కావడం పక్కా అంటున్నారు సినీ విశ్లేషకులు.

- Advertisement -

అయితే ఈ సినిమాలకు రవితేజ పెట్టిన పెట్టుబడులు రికవరీ అయినప్పటికీ ఒక్కటి కూడా లాభాల బాట పట్టకపోవడంతో నిర్మాతగా మాత్రం రవితేజ ఫెయిల్ అయ్యాడు అంటున్నారు. ఒకవైపు హీరోగా వరుస డిజాస్టర్లు అందుకుంటూ, మరోవైపు నిర్మాతగానూ కలిసి రాక రవితేజ రెండు విధాలుగా కష్టాల్లో పడ్డట్టుగా అయ్యింది. అయితే హీరోగా ఆయన తలుపు తడుతున్న అవకాశాలకు మాత్రం కొదవలేదు.

ప్రస్తుతం రవితేజ హీరోగా చేస్తున్న సినిమాల విషయానికి వస్తే… హరిష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా “మిస్టర్ బచ్చన్” సినిమా రూపొందుతోంది. ఈ ఏడాది వేసవి తర్వాత ఈ మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కేవీ అనుదీప్ దర్శకత్వంలో రవితేజ ఒక కామిక్ ఎంటర్టైనర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ మూవీ షూటింగ్ జూన్ లో స్టార్ట్ కానుంది. వచ్చే ఏడాది వేసవిలో రవితేజ, అనుదీప్ మూవీ రిలీజ్ కానుంది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు