Ravi Teja’s Eagle: ఈ కన్ఫ్యూజన్ ఏంటి రాజా… అసలు ఉందా.. లేదా?

సంక్రాంతి టైంలో బాక్సాఫీస్ వద్ద హీట్ పెరుగుతుంది. ఇప్పటి వరకు సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్ ఫిక్స్ అయ్యాయి. సురేష్ బాబు వల్ల.. సైందవ్ కూడా సంక్రాంతి రేసును తగ్గడం లేదు. అయితే ఇప్పుడు అందరి చూపులు నాగార్జున నటిస్తున్న నా సామి రంగ, రవితేజ నటిస్తున్న ఈగల్ సినిమాపై ఉన్నాయి. ఈ రెండు సినిమాలు వాయిదా పడబోతున్నాయని గత కొన్ని రోజుల నుంచి తెగ వార్తలు వచ్చాయి. దీనికి తగ్గట్టు మూవీ యూనిట్స్ కూడా సైలెంట్ గా ఉండటంతో వాయిదా కన్ఫామే అని అనుకున్నారు.

అనుకున్నట్టే నాగార్జున నా సామి రంగ మూవీ వాయిదా దాదాపు ఖరారు అయింది. కానీ, ఈగల్ విషయానికి వస్తే… నిర్మాతలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తాజాగా తమ సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సంక్రాంతికి విడుదల చేయడమే తమ ముందు ఉన్న లక్ష్యం అంటూ తెల్చి చెప్పారు. కానీ సంక్రాంతికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే.. నాలుగు తెలుగు సినిమాలు సర్వేవ్ అవ్వడం అంత సులువు కాదేమో అనిపిస్తుంది.

వచ్చేవి అన్ని కూడా బిగ్ బడ్జెట్ సినిమాలు కావడం వల్ల వాటికి బిజినెస్ తక్కువ జరుగుతుంది. అలాగే థియేటర్స్ షేరింగ్ సమస్య వల్ల కలెక్షన్లు కూడా తక్కువే రావొచ్చు. అలాగే ఇప్పటి వరకు ఏరియాల వైజ్ గా ఈగల్ మూవీ అమ్మకాలు జరగలేదని సమాచారం. దీనికి రెండు కారణాలు ఉన్నాయి.

- Advertisement -

ఇందులో ఒకటి… సంక్రాంతి. మోస్ట్ అవెయిటెడ్ మూవీ గుంటూరు కారం, ఓ వర్గం ప్రేక్షకులను కథ, కాస్ట్ అండ్ క్రూతో సంబంధం లేకుండా ఆట్రాక్ట్ చేసే హనుమాన్ మూవీ, సురేష్ బాబు అండతో వస్తున్న సైంధవ్ సినిమాలు ఈ సంక్రాంతి బరిలో ఉన్నాయి. వీటిని తట్టుకుని రవితేజ తన సినిమాకు కలెక్షన్లు తెచ్చుకోవడం అంత సులువేమీ కాదు. ముఖ్యంగా థియేటర్స్ తెచ్చుకోవడం కష్టం.

మరొకటి… రవితేజ గత రికార్డ్. గత ఐదు సంవత్సరాల నుంచి ఈ మాస్ మహారాజ్ కి పడ్డ ఏకైకా హిట్ ధమాకా. దీని తర్వాత వచ్చిన రావాణాసుర డిజాస్టార్ కాగా, టైగర్ నాగేశ్వరరావు యావరేజ్ గా నిలిచిపోయింది. ఇలాంటి సమయంలో రవితేజ సినిమా రైట్స్ ను కోనుగోలు చేయడానికి బయ్యర్లు ఆలోచిస్తున్నారట. అందులోనూ సంక్రాంతి లాంటి టైంలో రిస్క్ తీసుకోలేమని చెబుతున్నారట.

ఇలాంటి టైంలో నిర్మాతలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈగల్ పై ధైర్యం చేయాలనుకోవడం ఆశ్చర్యానికి గురి చేయడంలో తప్పులేదు. ఇన్ని సమస్యల మధ్య ఈగల్ ని సంక్రాంతి బరిలో నిలుపుతున్నారంటే.. అది కేవలం కార్తిక్ ఘట్టమనేని ఇచ్చిన కంటెంట్ పై నమ్మకంతోనేే అనుకోవచ్చు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు