Personality Development : మిమ్మల్ని ఎవరైనా మ్యానిపులేట్ చేస్తున్నారా? ఇలా తెలుసుకోండి

మ్యానిపులేటర్ అందరికీ చెడు ఉద్దేశాలు ఉండకపోవచ్చు. కానీ కొన్ని పరిస్థితుల్లో తమ అవసరాలను ఎదుటి వ్యక్తి ద్వారా తీర్చుకోవడానికి వాళ్లను మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. మ్యానిపులేషన్ అనగానే ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. కానీ ఎవరిని నొప్పించకుండా ఈ పద్ధతిని ఉపయోగించి పనులు చేయించుకోవాలని చూడడాన్నే మ్యానిపులేషన్ అంటారు. అయితే కొంతమంది దీనిని తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటారు. మ్యానిపులేటర్ల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిదే. మరి మిమ్మల్ని ఎవరైనా మ్యానిపులేట్ చెయ్యాలి అనుకుంటే తెలుసుకోవడం ఎలాగంటే…

మిమ్మల్ని వేరు చేసి మాట్లాడతారు…
ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని దూరం పెట్టి, ఒంటరిగా ఫీల్ అయ్యేలా చేస్తారు. మీకు సపోర్ట్ గా వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ లేరని ఫీల్ అయ్యేలా చేస్తారు. నెమ్మదిగా మీ చుట్టూ ఉన్నవారిని మీకు తెలియకుండానే ఒక్కొక్కరిగా దూరం చేస్తారు.

మీ ఇన్ సెక్యూరిటీతో ఆడుకుంటారు…
మ్యానిపులేటర్లు కామెడీ కామెడీగానే మీరు హర్ట్ అయ్యే కామెంట్స్ చేస్తారు. మీకున్న ఇన్ సెక్యూరిటీలను తెలుసుకుని ఎమోషన్స్ తో ఆడుకుంటారు. మిమ్మల్ని అవమానించేలా జోక్స్ వేస్తూ మీ ఆత్మగౌరవాన్ని కించపరుస్తారు. మీపై ఆధిపత్యాన్ని చెలాయించడానికి దీన్నే ఒక మార్గంగా భావిస్తారు.

- Advertisement -

మీ వీక్నేస్ ను ఉపయోగించుకుంటారు…
మీ ఇన్ సెక్యూరిటీస్ తో ఆడుకోవడం కుదరకపోతే, బలహీనతలను వాడి మిమ్మల్ని వాళ్లకు అనుకూలంగా మార్చుకోవడానికి ట్రై చేస్తారు. సాధారణంగా నో చెప్పలేని వ్యక్తులకు ఎక్కువగా పనులను అప్పగిస్తూ ఉంటారు. ఆ విధంగా మీ అసమర్థతను వాడుకుంటారు. కాబట్టి మీకు ఇబ్బందిగా అన్పించినప్పుడు మొహమాటం లేకుండా నో చెప్పడం అలవాటు చేసుకోండి.

మిమ్మల్ని తక్కువ చేసేలా మాట్లాడడం…
మిమ్మల్ని పొగుడుతూనే తక్కువ చేసి మాట్లాడతారు. మంచి పేరుతో వాళ్లకు రుణపడి ఉండేలా చేసుకుంటారు. ఇన్ డైరెక్ట్ గా మీలో ఉన్న అపరాధ భావాన్ని వాడుకుని, వాళ్ళ కోసం మీరు ఏదైనా చేసేలా చేస్తారు. మీరు వాళ్ల పట్ల జాలి పడేలా చేసి, మీ సానుభూతిని పొందుతారు. వాళ్లే నిజంగా తప్పు చేసినప్పటికీ ఆ నిందను మరొకరిపై వేస్తారు. దొంగ ఏడుపులు ఏడ్చి, మీ దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి ట్రై చేస్తారు.

వాళ్లు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా నమ్మిస్టారు…
మీ నుంచి ఏదైనా కావాలనుకున్నప్పుడు అబద్ధాలు చెప్తారు. తమ స్వార్థం కోసం అవతలి వ్యక్తిని మ్యానిపులేట్ చేయాలి అనుకుంటారు. వారి ఇష్టాలకు మీరు లొంగిపోయే వరకు మీపై ఏదో ఒక కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. అలాగే ఎవరైనా మిమ్మల్ని మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు లాగడానికి, అలాగే ఎవరైనా మిమ్మల్ని మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు లాగుతున్నారు అంటే మిమ్మల్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు