Kalki 2898AD : “కల్కి” రిలీజ్ డేట్ పై కన్నేసిన “ఇండియన్ 2”

ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ “కల్కి” మే 9న రిలీజ్ కాబోతుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ పై “భారతీయుడు 2” టీం కన్నేసింది. “కల్కి” మూవీ అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. మేకర్స్ చెప్పిన సమయానికే సినిమాను రిలీజ్ చేస్తామని అఫీషియల్ గా మరోసారి అనౌన్స్మెంట్ ఇచ్చినప్పటికీ, అది సాధ్యం అయ్యే పరిస్థితి లేదని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం “కల్కి” స్థానాన్ని “ఇండియన్ 2” తీసుకోబోతుందని తెలుస్తోంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ అండ్ ఫాంటసీ యాక్షన్ మూవీ “కల్కి 2989 AD”. మహానటి” వంటి క్లాసికల్ హిట్ తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న భారీ చిత్రం ఇది. దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజ నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. “కల్కి 2989 AD” మూవీని 2024 మే 9న రిలీజ్ చేయబోతున్నట్టుగా ఇప్పటికే మూవీ ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ వెల్లడించింది. కానీ వీఎఫ్ఎక్స్ వంటి పనుల కారణంగా “కల్కి” వాయిదా పడక తప్పదని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ సమ్మర్ రేసు నుంచి తప్పుకుందని, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోందని సమాచారం. ఇదే అదనుగా “కల్కి” వాయిదాను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి రెడీ అయింది “ఇండియన్ 2” టీం. “కల్కి” పోస్ట్ పోన్ అయితే మే 9న “ఇండియన్ 2” మూవీని అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయడానికి శంకర్ అండ్ టీం రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

కొన్నిరోజుల క్రితమే “ఇండియన్ 2”, “ఇండియన్ 3” సినిమాల షూటింగ్ ను పూర్తి చేసిన శంకర్, ఇప్పుడు ఈ రెండు సీక్వెల్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టాడు. ఇప్పటికైతే “ఇండియన్ 2” బిజినెస్ డీల్స్ క్లోజ్ అయ్యాయి. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత “ఇండియన్ 2” ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్నమాట. “ఇండియన్ 2″లో కమల్ హాసన్ హీరోగా నటిస్తుండగా, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ ప్రధాన పాత్రలు పోషించారు. యంగ్ సెన్సేషన్ అనిరుధ్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా, లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… “ఇండియన్ 2″లో హీరోగా, “కల్కి”లో విలన్ గా నటిస్తున్నాడు కమల్ హాసన్. ప్రస్తుతం హైదరాబాద్ లో కమల్ పోర్షన్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. కాగా త్వరలోనే “ఇండియన్ 2” మూవీ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు