Premalu: తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు

తెలుగు సినిమాల స్థాయి ఎంతవరకు పెరుగుతూ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఎక్కడో ఉన్న తెలుగు సినిమా బాహుబలి తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించింది. ఇప్పుడు తెలుగులో ఒక సినిమా వస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తారు. అలానే తెలుగు ప్రేక్షకులు కూడా భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఎంకరేజ్ చేయడంలో ముందు వరుసలో ఉంటారు.

చాలా సినిమాలు ఒరిజినల్ లాంగ్వేజ్ కంటే కూడా తెలుగులో ఎక్కువ హిట్ అయ్యాయని కూడా చెప్పొచ్చు. తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా భావోద్వేగాలతో కనెక్ట్ అయి అన్ని భాషల సినిమాలు చూడటానికి అలవాటు పడ్డారు. అలానే మలయాళం సినిమాలు చూడటం ఈ మధ్య ప్రేక్షకులు మొదలుపెట్టారు. ఓటీటీ ల పుణ్యమా అని ప్రపంచ సినిమాను నేడు చూడగలుగుతున్నాం.

అయితే కేవలం మలయాళం సినిమాలు ఓటీటీ లో మాత్రమే కాకుండా, థియేటర్ లో కూడా చూడటం మొదలుపెట్టారు తెలుగు ప్రేక్షకులు. ఈ మధ్యన డిస్ట్రిబ్యూటర్లు కూడా తమిళ్, మళయాళం సినిమాలను థియేటర్లో ఆడించడం మొదలుపెట్టారు. అయితే మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాలను కొంతమంది తెలుగులో అందించే ప్రయత్నం చేస్తారు.

- Advertisement -

అలానే రీసెంట్ టైమ్స్ లో సూపర్ హిట్ అయింది “ప్రేమలు” అనే మళయాళం సినిమా. ఈ సినిమాను తెలుగులో మార్చి 8న రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాను ప్రముఖ దర్శకులు రాజమౌళి కొడుకు కార్తికేయ రిలీజ్ చేస్తున్నాడు. సూపర్ హిట్ అయిన ఈ సినిమాను చాలామంది తెలుగు ప్రేక్షకులు వీక్షించారు. కానీ తెలుగు భాషలో చూడలేదు. అటువంటి తెలుగువారి కోసం ఈ సినిమాను మళ్ళీ మార్చి 8న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు