14YearsOfSamanthaLegacy : సమంత కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన సినిమాలివే..!

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లలో టాలెంటెడ్ హీరోయిన్ “సమంత” ఒకరు. ‘ఏ మాయ చేసావే’ అంటూ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, కుర్రాళ్ళని నిజంగానే మాయ చేసేసింది. పేరుకి మలయాళ భామే అయినా అచ్చతెలుగమ్మాయిలా పేరు తెచ్చుకుంది. టాలీవుడ్ లో నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేసే అతి తక్కువ మంది హీరోయిన్లలో ఈమె ఒకరు. సరిగ్గా ఇదే రోజు 14 ఏళ్ళ కిందట, అంటే 2010 ఫిబ్రవరి 26న టాలీవుడ్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. మామూలుగా టాలీవుడ్ లో ఇప్పుడున్న హీరోయిన్లు పదేళ్లకి మించి స్టార్ డమ్ ని కంటిన్యూ చేయలేదు. కానీ సమంత మాత్రం ఇప్పటికి అదే రేంజ్ స్టార్ డమ్ ని కొనసాగిస్తూ, కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తన క్రేజ్ ని కంటిన్యూ చేస్తుంది. అలాంటి సమంత కెరీర్ ని టర్న్ చేసిన సినిమాలు, తనని నటన పరంగా, మార్కెట్ పరంగా మంచి గుర్తింపు తెచ్చిబెట్టిన టాప్ 5 మూవీస్ పై ఓ లుక్కేద్దాం..

  1. ఏమాయచేసావే(2010) : నాగచైతన్య సమంత హీరోయిన్లుగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతోనే సమంత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన సామ్ డెబ్యూ ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాతోనే చై, సామ్ ల లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలిసిందే.
  2. ఈగ (2012) : రాజమౌళి దర్శకత్వంలో నాని, సమంత హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సమంత ని నటన పరంగా నిలబెట్టింది. అప్పటికి తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చి పలు అవార్డులు దక్కించుకుంది. మామూలుగా సమంత కి స్టార్ డమ్ దూకుడు సినిమాతో వచ్చిందంటారు. కానీ పెర్ఫార్మన్స్ పరంగా, నటన పరంగా పాన్ ఇండియా లెవెల్లో ఈగ సినీమాతోనే సామ్ కి అసలు గుర్తింపు వచ్చింది. అప్పటివరకు గ్లామర్ రోల్స్ కి మాత్రమే పరిమితమైన ఈ భామ పెర్ఫార్మన్స్ రోల్స్ లో కూడా ఇరగదీస్తోందని నిరూపించుకుంది.
  3. రంగస్థలం(2018) : రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా రామలక్ష్మి అనే పాత్రలో అద్భుతంగా నటించిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించాడు. దీనికి ముందు కొన్నాళ్లపాటు గ్లామర్ రోల్స్ ఎక్కువగా చేసిన సమంత ఈ సినిమాలో ఫస్ట్ టైం డీ గ్లామర్ గా కనిపించి మెప్పించింది. అచ్చం పల్లెటూరు అమ్మాయిగా పరాకాయ ప్రవేశం చేసి ఎంత సక్కగున్నావే అనిపించింది.
  4. మజిలీ(2019) : నాగచైతన్య సమంత పెళ్లి తర్వాత నటించిన సినిమా ఇది. ఈ సినిమాలో సమంత ఓ దశలో నాగ చైతన్యని బీట్ చేసేలా జీవించిందని చెప్పాలి. పైగా రియల్ లైఫ్ జోడి సినిమాలోనూ భార్య భర్తలుగా నటించేసరికి ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. శ్రావణి గా సమంత అభినయం అత్యద్భుతం అని చెప్పొచ్చు. అన్నిటికి మించి సినిమాలో ఈ సమంత ఇంట్రొడక్షన్ కే ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమాయే సామ్ చై చివరి సినిమా అవుతుందని అనుకోలేదెవ్వరు.
  5. యశోద(2022) : సమంత స్టార్ డమ్ పడిపోయింది అనుకున్న దశలో తానే మెయిన్ లీడ్ గా వచ్చిన లేడీ ఓరియెంటెడ్ మూవీ “యశోద”. ఓ సీక్రెట్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన సమంత ఈ సినిమాలో యశోద పాత్రలో జీవించిందని చెప్పాలి. అప్పటికే నాగచైతన్యతో విడిపోయిన సమంతను ఒక రకంగా కొంతమంది తప్పు చేసిందని, ఇక తన కెరీర్ అయిపోయినట్టే అని బ్లేమ్ చేసారు. అలాంటి టైం లో యశోద సినిమా సమంతకి మరో టర్నింగ్ పాయింట్ ఇచ్చిందని చెప్పొచ్చు.

ఇక వీటన్నిటికీ మించి బాలీవుడ్ లో వచ్చిన “ది ఫ్యామిలీ మ్యాన్” సీజన్ 2 లో సమంత పోషించిన రాజ్యలక్ష్మి అనే నెగిటివ్ పాత్ర తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది అని చెప్పొచ్చు. అయితే ఇదే సినిమాగా వచ్చి ఉంటే, సమంత నటనకి ఫిదా అయ్యి, ఓ పది, పదిహేను అవార్డులు సామ్ చేతిలో పెట్టేవారేమో. ఇక ఈ 14 ఏళ్ళ కెరీర్లో మధ్యలో వచ్చిన మనం, మహానటి, జాను లాంటి సినిమాల్లోనూ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు